Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Farmers Protest: పంజాబ్, హరియాణా సరిహద్దు ప్రాంతాల్లో మరోసారి రోడ్డెక్కిన రైతులు..

రైతులు గతంలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే వాటిని రద్దు చేస్తామని చెప్పడంతో సమ్మెను విరమించారు. తాజాగా మరోసారి పంజాబ్, హరియాణా రైతులు ఆందోళన బాట పట్టారు. పెండింగ్‌లో ఉన్న తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ మూడు రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేయాలని నిర్ణయించారు.

Farmers Protest: పంజాబ్, హరియాణా సరిహద్దు ప్రాంతాల్లో మరోసారి రోడ్డెక్కిన రైతులు..
Farmers Of Punjab And Haryana Once Again Protest To Resolve Their Demands
Follow us
Srikar T

|

Updated on: Nov 27, 2023 | 7:36 AM

రైతులు గతంలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే వాటిని రద్దు చేస్తామని చెప్పడంతో సమ్మెను విరమించారు. తాజాగా మరోసారి పంజాబ్, హరియాణా రైతులు ఆందోళన బాట పట్టారు. పెండింగ్‌లో ఉన్న తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ మూడు రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని సంయుక్త కిసాన్ మోర్చా ఆదివారం పిలుపు ఇవ్వడంతో వందలాది ట్రాక్టర్లలో రైతులు రోడ్లెక్కారు. దీంతో పంజాబ్, హరియాణా, చండీగఢ్ ప్రాంతాల సరిహద్దులను పోలీసులు మూసివేశారు.

ఈ నిరసనల్లో భాగంగా రైతులు ఆదివారం మొహాలిలోని అంబ్ సాహిబ్ గురుద్వారాకు చేరుకున్నారు. సోమవారం అక్కడి నుంచి చండీగఢ్ వైపుగా వెళ్తామని రూట్ మ్యాప్ ప్రకటించారు. గతంలో పంజాగ్ హరియాణా హైకోర్టు కొన్ని కీలక ఆదేశాలు వెలువరించింది. రైతులు రోడ్లపై బైఠాయించి నిరసనలు తెలపడం కోర్టు ధిక్కరణ కిందకి వస్తుందని పంచ్‌కుల పోలీస్ కమిషనర్ తెలిపారు. రైతుల యాత్రలను, నిరసనలను అడ్డుకునేందుకు చండీగఢ్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా బలగాలను మొహరించింది. చండీగఢ్ – పంచ్‌కుల సరిహద్దు ప్రాంతాలను మూసేసి మూడంచెల భద్రతను ఏర్పాటు చేసింది. కేవలం ర్యాలీలకు మాత్రమే అనుమతి ఉందని రోడ్లపై బైఠాయించడం, ట్రాఫిక్ కు అంతరాయం కల్గించడం లాంటివి చేయకూడదని హెచ్చరించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వేసవిలో మెరిసే చర్మం కోసం నిమ్మ రసాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసా
వేసవిలో మెరిసే చర్మం కోసం నిమ్మ రసాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసా
వెండి నగలకు బంగారం ఇవ్వమన్న ఇద్దరు మహిళలు.. డౌట్ వచ్చి..
వెండి నగలకు బంగారం ఇవ్వమన్న ఇద్దరు మహిళలు.. డౌట్ వచ్చి..
మనిషికి పంది లివర్ అమర్చిన డాక్టర్లు! ఎక్కడంటే..?
మనిషికి పంది లివర్ అమర్చిన డాక్టర్లు! ఎక్కడంటే..?
తగ్గేదేలే.. ఏపీలో ఉప ఎన్నికల పంచాయితీ.. 9 ప్రాంతాల్లో హోరీ హోరీ..
తగ్గేదేలే.. ఏపీలో ఉప ఎన్నికల పంచాయితీ.. 9 ప్రాంతాల్లో హోరీ హోరీ..
క్యాబ్ ఖర్చుకే ఎయిర్ టాక్సీ.. జాలీ జాలీగా ఆకాశ ప్రయాణం..
క్యాబ్ ఖర్చుకే ఎయిర్ టాక్సీ.. జాలీ జాలీగా ఆకాశ ప్రయాణం..
అప్పట్లో ఇంటి అద్దె కట్టడానికి అమ్మానాన్న ఎన్నో ఇబ్బందులుపడ్డారు.
అప్పట్లో ఇంటి అద్దె కట్టడానికి అమ్మానాన్న ఎన్నో ఇబ్బందులుపడ్డారు.
గుడ్‌న్యూస్‌.. కానిస్టేబుల్‌ పోస్టులకు ఎట్టకేలకు మోక్షం..!
గుడ్‌న్యూస్‌.. కానిస్టేబుల్‌ పోస్టులకు ఎట్టకేలకు మోక్షం..!
ఇండియా-ఏ తరఫున ఆడనున్న కోహ్లీ, రోహిత్‌ శర్మ!
ఇండియా-ఏ తరఫున ఆడనున్న కోహ్లీ, రోహిత్‌ శర్మ!
అమ్మవారికి నైవేద్యంగా చిరుతిళ్ళు.. ఈ శక్తి పీఠం ఎక్కడ ఉందంటే
అమ్మవారికి నైవేద్యంగా చిరుతిళ్ళు.. ఈ శక్తి పీఠం ఎక్కడ ఉందంటే
రామ్ చరణ్‌కు వెల్లువెత్తుతున్న బర్త్ డే విషెస్
రామ్ చరణ్‌కు వెల్లువెత్తుతున్న బర్త్ డే విషెస్