డిసెంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌.? వైరల్ అవుతున్న ట్వీట్.. వివరణ ఇచ్చిన కేంద్రం..

'కరోనా కేసులు ఇంకా అదుపులోకి రానందున డిసెంబర్ 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా మరోసారి లాక్‌డౌన్‌ విధిస్తారు'' అనే ట్వీట్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు..

  • Ravi Kiran
  • Publish Date - 4:30 am, Fri, 13 November 20
డిసెంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌.? వైరల్ అవుతున్న ట్వీట్.. వివరణ ఇచ్చిన కేంద్రం..

National Lockdown Once Again: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దీనితో వాస్తవాల కంటే కల్పితాలే ఎక్కువగా ప్రచారం అవుతున్నాయి. ఎలాంటి అడ్డు అదుపు లేకుండా ఫేక్ న్యూస్ స్పీడ్‌గా విస్తరిస్తోంది. తాజాగా ప్రజలను కంగారు పెట్టేలా ఓ పుకారు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

”కరోనా కేసులు ఇంకా అదుపులోకి రానందున డిసెంబర్ 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా మరోసారి లాక్‌డౌన్‌ విధిస్తారు” అనే ట్వీట్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీనితో కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారన్న వార్తను కొట్టిపారేసింది. ఆ ట్వీట్‌ను ఎవరో మార్ఫింగ్ చేశారని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెల్లడించింది. మరోసారి లాక్‌డౌన్‌ విధించడంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ట్వీట్ పోస్ట్ చేసింది. కాగా, దేశంలో ప్రస్తుతం అన్‌లాక్ 6.0 మార్గ‌ద‌ర్శ‌కాలు అమలవుతున్న సంగతి తెలిసిందే.

నిజం: డిసెంబర్ 1 నుంచి లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించలేదు..

Also Read: 

పదో తరగతి విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పరీక్షలపై కీలక నిర్ణయం.!

రైలు ప్రయాణీకులకు ముఖ్య గమనిక.. 12 రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే.. వివరాలివే..!

ఏపీ: సీఎం వైఎస్ జగన్ గుడ్ న్యూస్.. కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీస్ గడువు పొడిగింపు..