అమెరికా ప్రెసిడెంట్ అయినా… కట్ చేస్తాం..

అమెరికా అధ్యక్షుడైనా.. అనకాపల్లి అంకయ్య అయినా రూల్ ఈజ్ రూల్ అంటోంది ఫేస్ బుక్.  నిబంధనలకు అనుగుణంగా లేని కామెంట్స్ చేస్తే వాటిని తొలగిస్తామని ఫేస్‌బుక్‌ తేల్చేసంది.

అమెరికా ప్రెసిడెంట్ అయినా... కట్ చేస్తాం..
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 19, 2020 | 6:01 PM

అమెరికా అధ్యక్షుడైనా.. అనకాపల్లి అంకయ్య అయినా రూల్ ఈజ్ రూల్ అంటోంది ఫేస్ బుక్.  నిబంధనలకు అనుగుణంగా లేని కామెంట్స్ చేస్తే వాటిని తొలగిస్తామని ఫేస్‌బుక్‌ తేల్చేసంది. అధ్యక్షుడు, కరోనా వైరస్‌ లేదా ఎన్నికలకు సంబంధించి తమ ప్రమాణాలకు విరుద్ధంగా విద్వేష పూరిత, అసత్య సమాచారాన్ని షేర్‌ చేస్తే దానికి ఫేస్‌బుక్‌లో ప్లేస్ లేదంటూ ఫేస్ బుక్  సీఓఓ షెరిల్‌ సాండ్‌బెర్గ్‌ ప్రకటించారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రసంగాలను ఏవిధంగా పర్యవేక్షిస్తారనే ప్రశ్నకు సమాధానంగా షెరిల్‌ సాండ్‌బెర్గ్ ఈ విధంగా స్పందించారు. కాగా, అమెరికా ఓటర్లకు ఎన్నికలకు సంబంధించిన కచ్చితమైన సమాచారం అందించేందుకు ఫేస్‌బుక్‌ గత వారం ‘‘ఓటింగ్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌’’ ప్రారంభించిన సంగతి తెలిసిందే.

గతంలో పోలీసుల అదుపులో ఉన్న నల్ల జాతీయుడు జార్జి ఫ్లాయిడ్‌ మృతితో ఊపందుకున్న ‘బ్లాక్‌ లైవ్స్‌‌ మ్యాటర్‌’ ఉద్యమాన్ని ఉద్దేశించి డొనాల్డ్‌ ట్రంప్‌ ఫేస్‌బుక్‌లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే సంస్థ యాజమాన్యం వాటిని తొలగించకపోవటంతో.. ఇతరులతో పాటు సొంత ఉద్యోగుల నుంచి విమర్శలకు గురైంది. అంతేకాకుండా భారత్‌లో కూడా ఫేస్‌బుక్‌ వ్యవహార శైలి ఇటీవల వివాదాస్పదమవుతుండటంతో ఇది ప్రధాన చర్చకు కారణమైంది.

కొన్ని పార్టీలకు చెందిన ప్రసంగాలు, పోస్టులపై సంస్థ చూసీచూడనట్టుగా వ్యవహరిస్తోందిని విమర్శలు రావడం… దీనితో తాము ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వబోమని ఫేస్ బుక్  ప్రతినిధులు ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో సంస్థ సీఓఓ తాజా ప్రకటనతో ఫేస్‌బుక్‌ వైఖరి మరింత స్పష్టమైనట్లైంది.