బ్రేకింగ్: మాజీ మంత్రి మాదాటి నర్సింహా రెడ్డి మృతి
మాజీ మంత్రి మాదాటి నర్సింహా రెడ్డి(85) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో.. రాత్రి నర్సింహారెడ్డి తుది శ్వాస విడిచారు. గత కొద్ది కాలంగా అనారోగ్య సమస్యలతో ఆయన బాధ పడుతున్నట్టు సమాచారం. దివంగత, మాజీ ప్రధాని పీవీ నరసింహా రావుకు అత్యంత సన్నిహితంగా ఉండేవారు. నర్సింహా రెడ్డి భూపాలపల్లి జిల్లా మొసలపల్లిలో జన్మించారు. నర్సింహా రెడ్డి మృతికి తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. కాగా.. కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ కూడా ఆయన కుటుంబసభ్యులకు […]
మాజీ మంత్రి మాదాటి నర్సింహా రెడ్డి(85) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో.. రాత్రి నర్సింహారెడ్డి తుది శ్వాస విడిచారు. గత కొద్ది కాలంగా అనారోగ్య సమస్యలతో ఆయన బాధ పడుతున్నట్టు సమాచారం. దివంగత, మాజీ ప్రధాని పీవీ నరసింహా రావుకు అత్యంత సన్నిహితంగా ఉండేవారు. నర్సింహా రెడ్డి భూపాలపల్లి జిల్లా మొసలపల్లిలో జన్మించారు. నర్సింహా రెడ్డి మృతికి తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. కాగా.. కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ కూడా ఆయన కుటుంబసభ్యులకు సంతాపం వ్యక్తం చేశారు.