మాజీ సీఎం ఫడ్నవీస్ తో సంజయ్ రౌత్ భేటీ

కరిపై మరొకరు విమర్శలతో దుమ్మెత్తి పోసుకునే మహారాష్ట్ర అధికార, విపక్షాల నేతలు రహస్య భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీ, శివసేన బంధం తెగిపోయిన తర్వాత ఇరు పార్టీల నేతలు శనివారం ఓ హోటల్ లో సమావేశమయ్యారు.

మాజీ సీఎం ఫడ్నవీస్ తో సంజయ్ రౌత్ భేటీ
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 27, 2020 | 3:19 PM

శత్రుత్వం రాజకీయాలకే గానీ వ్యక్తులకు కాదని మరోనారి రుజువు చేశారు పొలిటికల్ లీడర్లు. తెల్లవారితే ఒకరిపై మరొకరు విమర్శలతో దుమ్మెత్తి పోసుకునే మహారాష్ట్ర అధికార, విపక్షాల నేతలు రహస్య భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీ, శివసేన బంధం తెగిపోయిన తర్వాత ఇరు పార్టీల నేతలు శనివారం ఓ హోటల్ లో సమావేశమయ్యారు. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ముంబైలోని ఓ హోటల్ లో భేటీ అయ్యారు. అయితే, ఈ సమావేశానికి ఏ మాత్రమూ రాజకీయ ప్రాధాన్యత లేదని ఇరు వర్గాలు స్పష్టం చేశాయి. అయితే, ఈ భేటీపై ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. శివసేన అధికారిక పత్రిక ‘సామ్నా’ లో ఇంటర్వ్యూ కోసమే ఫడ్నవీస్ ను కలిశామని, ఈ భేటీపై సీఎం ఉద్ధవ్‌కు కూడా సమాచారం ఉందని తెలిపారు. దేవేంద్ర ఫడ్నవీస్ తమ శత్రువేమీ కాదు. ఆయనతో కలిసి పనిచేశాం. ఫడణ్‌వీస్ తో భేటీ కావడం నేరమేమి కాదన్నారు. ఇప్పుడు బీజేపీ శాసనసభా పక్షనేత. సిద్ధాంత పరంగా వైరుద్ధ్యమే కానీ… శత్రువులమేమీ కామని రౌత్ ప్రకటించారు. అయితే ఈ ఇంటర్వ్యూకు మాజీ సీఎం ఫడణ్‌వీస్ ఒప్పుకున్నారని శివసేన ప్రకటించింది. గతంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో కూడా ఇంటర్వ్యూ చేశామని, ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ చేయాలనుకుంటున్నామన్నారు. త్వరలో రాహుల్ గాంధీ, అమిత్‌షా ఇంటర్వ్యూలు కూడా ఉంటాయని ఆయన వెల్లడించారు.