బతుకమ్మ: నేడు ‘ఎంగిలిపువ్వు’ బతుకమ్మ.. వాయనంగా తమలపాకులు

తెలంగాణలో ఆశ్వీయుజ మాస అమావాస్య రోజు నుంచి ‘ బతుకమ్మ’ వేడుకలను 9 రోజులపాటు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. శనివారం (సెప్టెంబరు 28) బతుకమ్మ పండుగలో మొదటి రోజైన ‘ ఎంగిలి పువ్వు’ బతుకమ్మను వేడుకగా జరుపుకోనున్నారు. ఎంగిలి పువ్వు అనడానికి కారణం లేకపోలేదు.. బతుకమ్మను పేర్చడానికి వాడే పువ్వులను ఒకరోజు ముందే తెంపుకొచ్చి వాటిని వాడిపోకుండా నీళ్లలో వేసి మర్నాడు ‘బతుకమ్మ’గా పేరుస్తారు. అందుకే మొదటి రోజును ఎంగిలిపువ్వు అంటారు. ఈ రోజునాడు తెలంగాణ పల్లెల్లో […]

బతుకమ్మ: నేడు 'ఎంగిలిపువ్వు' బతుకమ్మ.. వాయనంగా తమలపాకులు
Follow us

| Edited By:

Updated on: Sep 28, 2019 | 6:13 PM

తెలంగాణలో ఆశ్వీయుజ మాస అమావాస్య రోజు నుంచి ‘ బతుకమ్మ’ వేడుకలను 9 రోజులపాటు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. శనివారం (సెప్టెంబరు 28) బతుకమ్మ పండుగలో మొదటి రోజైన ‘ ఎంగిలి పువ్వు’ బతుకమ్మను వేడుకగా జరుపుకోనున్నారు. ఎంగిలి పువ్వు అనడానికి కారణం లేకపోలేదు.. బతుకమ్మను పేర్చడానికి వాడే పువ్వులను ఒకరోజు ముందే తెంపుకొచ్చి వాటిని వాడిపోకుండా నీళ్లలో వేసి మర్నాడు ‘బతుకమ్మ’గా పేరుస్తారు. అందుకే మొదటి రోజును ఎంగిలిపువ్వు అంటారు. ఈ రోజునాడు తెలంగాణ పల్లెల్లో వాయనంగా తమలపాకులు, తులసి ఆకులు ఇచ్చుకుంటారు.

బతుకమ్మను పేర్చడానికి సేకరించిన పూలను పవిత్రమైనవిగా భావిస్తారు. భక్తిభావంతో.. పవిత్ర మనస్సుతో పూలను సేకరిస్తారు. అయితే పూలను అంచెలంచెలుగా సమానంగా ఉండేలా పేర్చాలి. ఆ పూల కాడలు చేతులతో సమానంగా చించి వేయాలి. కత్తితో కోసినా… నోటితో కొరికినా ఆ పూలు ఎంగిలై మలినమవుతాయి. ఇలా పూర్వ కాలంలో కొందరు మహిళలు నోటితో కొరికి పేర్చడంతో అప్పటి నుంచి పెత్రామాస (పెద్దల అమవాస్య) సందర్భంగా ఆడే బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మ అని అంటారని ప్రతీతి. అమావాస్య రోజు నుంచి తొమ్మిది రోజులపాటు బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ వచ్చిందంటే చాలు ఆడపడచులు తమ సొంతూళ్లకు చేరుకుంటారు. పెళ్లి కావాల్సిన వారు పండుగ తొలిరోజు నుంచి తొమ్మిది రోజులపాటు బతుకమ్మను గౌరమ్మగా కొలిస్తే మంచి వరుడు రావడంతోపాటు సౌభాగ్యం కలకాలం నిలుస్తుందని నమ్మకం.