Eluru Mystery Disease: నీటి కాలుష్యంతోనే అంతుచిక్కని వ్యాధి.? మూలాలపై నేడు స్పష్టత.. తగ్గుతున్న కేసుల సంఖ్య.!

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వింత వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం బాధితుల సంఖ్య 607కి చేరుకుంది.

  • Ravi Kiran
  • Publish Date - 11:01 am, Fri, 11 December 20
Eluru Mystery Disease: నీటి కాలుష్యంతోనే అంతుచిక్కని వ్యాధి.? మూలాలపై నేడు స్పష్టత.. తగ్గుతున్న కేసుల సంఖ్య.!

Eluru Mystery Disease: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వింత వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం బాధితుల సంఖ్య 607కి చేరుకుంది. వీరిలో ఇప్పటివరకు 538 మంది రోగులను డిశ్చార్జ్‌ చేయగా.. ప్రస్తుతం 35 మంది ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

పరిస్థితి విషమంగా ఉన్న మరో 33 మంది గుంటూరు, విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ఈ వింత వ్యాధి కారణంగా ముగ్గురు మరణించారు. కాగా, ఈ వింత వ్యాధి మూలాలపై ఎయిమ్స్, ఎన్‌ఐఎన్ సహా ఇతర జాతీయ సంస్థలు నివేదికలు ఇవ్వనున్నాయి. ఇక ఆయా కమిటీలు ఇచ్చే నివేదికలను అధ్యయనం చేసేందుకు సీఎస్ నీలం సాహ్ని ఆధ్వర్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.

Also Read: రైల్వే ప్రయాణీకులకు ముఖ్య గమనిక.. పలు స్పెషల్ ట్రైన్స్ సమయాల్లో మార్పు.. కీలక సమాచారం ఇదే..