Breaking : ఢిల్లీలో మరోసారి భూకంపం

దేశ రాజధాని ఢిల్లీలో వ‌రుస భూకంపాలు ప్ర‌జ‌ల‌ను క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో భూ ప్రకంపనలు న‌మోద‌య్యాయి.

  • Ram Naramaneni
  • Publish Date - 3:11 pm, Mon, 8 June 20
Breaking : ఢిల్లీలో మరోసారి భూకంపం

దేశ రాజధాని ఢిల్లీలో వ‌రుస భూకంపాలు ప్ర‌జ‌ల‌ను క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో భూ ప్రకంపనలు న‌మోద‌య్యాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 2.1గా ఉంది. గురుగ్రామ్‌కు స‌మీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు అంచ‌నా వేస్తున్నారు. ఇక‌ హర్యానాలోనూ పలు ఏరియాల్లోనూ భూప్రకంపనలు సంభ‌వించాయి. గత కొన్ని రోజులుగా ఢిల్లీ-ఎన్‌సీఆర్ రీజియన్‌లో తరచూ భూకంపాలు భ‌యోత్పాతాలు క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పటికే కోవిడ్-19 వీర‌విహారం చేస్తుండటంతో వణికిపోతున్న ఢిల్లీ ప్ర‌జ‌లు భూకంపాలతో టెన్ష‌న్ కు గురవుతున్నారు.

ఏప్రిల్ నెల‌లో 12, 13 తేదీల్లోనూ…మే నెల 10, 15, 29 తేదీల్లోనూ ఢిల్లీ ప్ర‌జ‌ల‌ను భూకంపాలు భ‌య‌పెట్టాయి. తాజాగా మ‌రోసారి భూప్ర‌క‌పంన‌లు అల‌జ‌డి రేపాయి. వరస భూ ప్రకంపనలతో ఢిల్లీ వాసుల్లో కల‌వ‌రం మొద‌లైంది. సిట్యువేష‌న్ తేడాగా ఉంద‌ని.. ముప్పు వెంబ‌డిస్తోంద‌ని పలువురు నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.