TS DGP Mahender Reddy : ఈ-పాస్ ఉంటేనే రాష్ట్రంలోకి అనుమతి.. అంబులెన్స్‌లకు మాత్రం ఆంక్షలు లేవు..
TS DGP Mahender Reddy : తెలంగాణలో లాక్‌డౌన్ ఆంక్షలను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ
TS DGP Mahender Reddy : తెలంగాణలో లాక్‌డౌన్ ఆంక్షలను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే అన్ని వాహనదారులకు తప్పనిసరిగా సంబంధిత రాష్ట్రాల అధికారులు జారీ చేసిన ఈ-పాస్ లేదా తత్సమాన పాస్ లుంటేనే అనుమతిస్తామని స్పష్టంవేశారు. అయితే ఇతర రాష్ట్రాల నుంచి పేషంట్లను తీసుకువచ్చే అంబులెన్సులు, ఇతర వాహనాలపై మాత్రం ఏ విధమైన ఆంక్షలు లేకుండా రాష్ట్రంలోకి యధావిధిగా అనుమతిస్తున్నామని తెలిపారు.
వివిధ రాష్ట్రాల నుండి తెలంగాణకు వచ్చే వాహనాలను ఆయా రాష్ట్రాల సరిహద్దుల్లో నిలిపి వేస్తున్నారన్న వార్తలపై డీజీపీ మహేందర్ రెడ్డి నేడు వివరణ ఇచ్చారు. మెడికల్ ఎమర్జెన్సీ మినహా సంబంధిత రాష్ట్రాలు జారీచేసిన ఈ-పాస్ లను కలిగి ఉన్న అన్ని రకాల వాహనదారులను మాత్రం అనుమతిస్తున్నామని తెలిపారు. దీంతో పాటు జాతీయ రహదారులపై అన్నిరకాల ట్రాన్స్ పోర్ట్ వాహనాలను అనుమతిస్తున్నామని స్పష్టం చేశారు తెలంగాణా రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణకై లాక్ డౌన్ విధించిన సందర్భంగా ట్రాఫిక్ నియంత్రించేందుకు పలు చర్యలు చేపట్టామని తెలిపారు.
ఈ పాస్ లేకున్నా అంబులెన్స్ లతో పాటు అత్యవసర వాహనాలను మాత్రం తెలంగాణలోకి అనుమతి ఇస్తున్నారు.ఈ పాస్ విషయం తెలియని చాలా మంది ప్రయాణకులు రోడ్లపైనే ఎదురు చూస్తున్నారు. ఈ పాస్ తీసుకొంటేనే రాష్ట్రంలోకి అనుమతి ఇస్తామని తెలంగాణ పోలీసులు తేల్చి చెప్పడంతో ఈ పాస్ కోసం ప్రయాణీకులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అదే సమయంలో ఏపీకి చెందిన పోలీసు ఉన్నతాధికారులు తెలంగాణకు చెందిన పోలీసులతో ఈ విషయమై సంప్రదింపులు జరుపుతున్నారు.