AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రేపటి నుంచి పెద్దమ్మతల్లి ఆలయంలో దసరా ఉత్సవాలు

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ పెద్దమ్మతల్లి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఈనెల 17 నుంచి 25వ వరకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ప్రకటించింది...

రేపటి నుంచి పెద్దమ్మతల్లి ఆలయంలో దసరా ఉత్సవాలు
Sanjay Kasula
|

Updated on: Oct 16, 2020 | 10:30 AM

Share

Paddamma Thalli Temple : హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ పెద్దమ్మతల్లి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఈనెల 17 నుంచి 25వ వరకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ప్రకటించింది.

తొలిరోజున పెద్దమ్మతల్లి బాలా త్రిపురసుందరీదేవిగా, 18న గాయత్రీ దేవిగా, 19న అన్నపూర్ణ దేవిగా, 20న గజలక్ష్మిగా, 21న లలితాదేవిగా, 22న సరస్వతీదేవిగా, 23న దుర్గాదేవిగా, 24న మహిషాసురమర్థ్ధిని అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈనెల 25న దసరా రోజున అమ్మవారు నిజరూప దర్శనం ఇవ్వనున్నారు. కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ భక్తులను ఆలయంలోకి అనుమతిస్తామని ఆలయ ఫౌండర్‌ ట్రస్టీ పీ.విష్ణువర్దన్‌రెడ్డి తెలిపారు.

తొలిరోజు బాలా త్రిపుర సుందరి అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న అమ్మవారు… తొమ్మిది రోజుల పాటు వివిధ రూపాల్లో భక్తులను కరుణిస్తుంది. జూబ్లీహిల్స్‌ పెద్దమ్మతల్లిని మొక్కినా.. తలచినా చాలు చల్లగా చూస్తుందని రాష్ట్ర ప్రజల విశ్వాసం. తల్లి ఆలయంలో నమ్మకంతో నాణెం నిలబెట్టినా.. చుట్టూ ప్రదక్షణలు చేసినా మనసులో బాధలు తీరుతాయని ప్రతి రోజూ అమ్మ చెంత పండగ నిర్వహిస్తుంటారు.

అలాంటిది దసరా ఉత్సవాలు వచ్చాయంటే ఇక సందడి అంతా ఇంతా కాదు. వారం రోజుల నుంచే ఆలయం శరన్నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతోంది. ఆలయానికి కేవలం జంటనగరాల నుంచే కాకుండా  తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతలకు చెందిన భక్తులు వస్తుంటారు. ఆది, మంగళ, శుక్రవారాల్లో ఈ ఆలయానికి భక్తుల రద్దీ అధికం.