జర్నలిస్టు నుంచి జననేతగా ఎదిగిన రఘునందన్​ రావు

జర్నలిస్టు నుంచి జననేతగా ఎదిగిన రఘునందన్​ రావు

రఘునందన్‌రావు...ఇప్పుడి పేరు తెలంగాణ వ్యాప్తంగా సంచలనమైంది. దుబ్బాక ధనాధన్‌ ఫైట్‌లో డైనమెట్‌లా పేలారు.

Balaraju Goud

|

Nov 10, 2020 | 5:25 PM

రఘునందన్‌రావు…ఇప్పుడి పేరు తెలంగాణ వ్యాప్తంగా సంచలనమైంది. దుబ్బాక ధనాధన్‌ ఫైట్‌లో డైనమెట్‌లా పేలారు. తన పార్టీకి ఊహించని విజయాన్ని అందించారు. రౌండ్ రౌండ్‌కు మారుతున్న సమీకరణాలు చివరిదాకా ఉత్కంఠ రేపినా.. విజయలక్ష్మి రఘునందన్‌ను వరించింది. ఐపీఎల్ మ్యాచ్​ తరహాలో ఉత్కంఠగా సాగిన ఓటింగ్​లో అధికార పార్టీపై స్వల్ప ఆధిక్యంతో గెలుపొందారు. తెరాస జోరు, కాంగ్రెస్ నుంచి పోటీని దీటుగా ఎదుర్కొని విజయభేరీ మోగించారు.

1968, మార్చి 23న సిద్దిపేటలో పుట్టిన మాధవనేని రఘునందన్ రావు… తండ్రి పేరు భగవంతరావు. చిన్నతనం నుంచి రాజకీయాలపై అవగాహన ఉన్న ఆయన బీఎస్సీ డిగ్రీ వరకు సిద్దిపేటలో చదివారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లా పట్టాను అందుకున్నారు. ఆ తర్వాత 1991లో పటాన్‌చెరులో ఓ తెలుగు డైలీ న్యూస్‌పేపర్‌లో కంట్రిబ్యూటర్‌గా పనిచేశారు. తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు బార్ అసోసియేషన్ మెంబర్‌గా లాయర్‌ ప్రాక్టీస్ చేశారు.

2001లో టీఆర్‌ఎస్ పార్టీలో చేరిన ఆయన రాజకీయాల్లో ఫుల్‌గా యాక్టివ్‌గా ఉండేవారు. పొలిట్‌బ్యూరో సభ్యులుగా, మెదక్ జిల్లా అధ్యక్షులుగా పనిచేశారు. సూటిగా ..సబ్జెక్ట్‌మీద మాట్లాడటం రఘునందన్‌రావుకు ప్లస్ పాయంట్స్. టీఆర్‌ఎస్‌లో చేరిన ఏడాదిలోనే కీలక నేతగా మారారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబుతో క్లోజ్‌గా ఉండటం, ఆయనతో రహస్య మీటింగ్ పెట్టారన్న ఆరోపణలపై టీఆర్‌ఎస్ పార్టీ రఘునందన్‌రావును సస్పెండ్ చేసింది. తర్వాత బీజేపీలో చేరిన ఆయన…దుబ్బాక నియోజకవర్గం నుంచే రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయారు. 2014, 2019 మూడోస్థానానికే పరిమితమయ్యారు..

దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో… బై ఎలక్షన్స్ అనివార్యమయ్యాయి. ఈ దఫా టీఆర్‌ఎస్‌ తరపున సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాత ఎన్నికల బరిలో నిలిచారు. అందరూ ఆమె గెలుపు నల్లేరుపై నడకేనని భావించారు. అందుకే పోటీలో నిలబడ్డా కాంగ్రెస్‌ అంతగా ప్రచారం చేయలేదు. కానీ బీజేపీ క్యాడర్‌ బైఎలక్షన్స్‌ను తేలిగ్గా తీసుకోలేదు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన దగ్గరనుంచి రఘనందన్‌రావు జనంలోనే ఉన్నారు. కాంగ్రెస్ బలహీనపడటం ఆ పార్టీ ఓట్లు రఘునందన్‌రావుకు టర్న్‌ కావడం బీజేపీకి బాగా కలిసివచ్చింది.

రెండుసార్లు దుబ్బాకను దక్కించుకోలేకపోయినా రఘునందన్‌రావు…మూడో ప్రయత్నంలో దక్కించుకోవడంతో…ఆనందం వ్యక్తం చేస్తున్నారు రఘునందన్‌రావు అభిమానులు.. ఇదే తరహా ఫలితాలను తెలంగాణలో మున్ముందు ఉంటాయని బీజేపీ కేడర్‌ ఉత్సాహంగా చెబుతోంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu