కోవిడ్ గురించి భయపడకండి, నిర్భయంగా ఓటు వేయండి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

కోవిడ్ గురించి భయపడరాదని, నిర్భయంగా ఈ ఎన్నికల్లో ఓటు వేయాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోవిడ్ రోగులను ఉద్దేశించి అన్నారు. మీరు సంకోచం లేకుండా పోలింగ్ కేంద్రాలకు..

కోవిడ్ గురించి భయపడకండి, నిర్భయంగా ఓటు వేయండి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Apr 26, 2021 | 10:26 AM

కోవిడ్ గురించి భయపడరాదని, నిర్భయంగా ఈ ఎన్నికల్లో ఓటు వేయాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోవిడ్ రోగులను ఉద్దేశించి అన్నారు. మీరు సంకోచం లేకుండా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయండి.. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని చీఫ్ సెక్రటరీని ఆదేశించాం అన్నారు. ‘కరోనా వైరస్ గురించి భయపడకండి.. నేను మీ వాచ్ మన్ ని’ అని ఆమె వ్యాఖ్యానించారు. ప్రచార కార్యక్రమాల కన్నా తాను కోవిడ్ మీటింగ్స్ ఎక్కువగా నిర్వహిస్తున్నానని ఆమె ముర్షీదాబాద్ జిల్లా బెర్హం పూర్లో జరిగిన వర్చ్యువల్ మీటింగ్ లో పేర్కొన్నారు. ప్రధాని మోదీ కేవలం ప్రసంగాలు మాత్రమే చేస్తారని, ఈ పాండమిక్ ని హ్యాండిల్ చేయలేకపోతున్నారని, పైగా దేశంలో ఆక్సిజన్ కొరతకు కేంద్రానిదే బాధ్యత అని ఆమె ఆరోపించారు. ప్రధాని ‘మన్ కీ బాత్’ చేస్తున్నారు. దీనిపై ఎవరికి  ఆసక్తి ఉంది ? మనకు కోవిడ్ కీ బాత్ అవసరం.. అన్నారామె.. బెంగాల్ కి రావలసిన ఆక్సిజన్ ని ఉత్తరప్రదేశ్ కి మళ్లిస్తున్నారని ఆమె అన్నారు. ఈ పాటికి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని  పెద్ద ఎత్తున చేపట్టి ఉంటే పరిస్థితి ఇంత తీవ్రంగా ఉండేది కాదని, ఈ ప్రధాని 80 దేశాలకు ఉచితంగా వ్యాక్సిన్ పంపించారని మమతా బెనర్జీ నిప్పులు కక్కారు.

కేంద్రానికి ఎదురొడ్డి నిలిచేది బెంగాల్ మాత్రమేనని, అందువల్లే ఈ ఎన్నికలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయని ఆమె చెప్పారు. వీటిని మొత్తం దేశమంతా చూస్తోందన్నారు. యూపీ, గుజరాత్ రాష్ట్రాలకు ఎక్కువగా ఆక్సిజన్ వెళ్తోందని ఆమె ఆరోపించారు. ఇందులోనూ వివక్ష చూపుతున్నారని విమర్శించారు. యూపీ, అస్సాం, త్రిపుర వంటి రాష్ట్రాలు అంత్యక్రియల స్థలాల చుట్టూ గోడలు నిర్మిస్తున్నాయని, కానీ బెంగాల్ లో ఇలాంటి ‘అడ్డాలు’ లేవని దీదీ చెప్పారు. వన్ నేషన్, వన్ లీడర్ అని ప్రధాని అంటున్నారు.. మరి వ్యాక్సిన్ కి ఒకే ధర ఎందుకు ఉండరాదు అని ఆమె ప్రశ్నించారు. కేంద్రానికి ఓ ధర, రాష్ట్రాలకు మరో ధర ఏమిటన్నారు. కాగా…  బెంగాల్ లో ఏడో దశ  పోలింగ్  మంగళవారం, ఈ నెల 29 న తుది దశ పోలింగ్ జరగనుంది. మే 2 న ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు.

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!