భారత గడ్డపై దిగనున్న రాఫెల్ విమానం
మోదీ, రాహుల్‌ల మధ్య రచ్చ రేపిన రాఫెల్ విమానాలు భారత గడ్డపై అడుగుపెట్టనున్నాయి. మొదటి రాఫెల్ యుద్ధ విమానాన్ని ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో భారత్‌కు అప్పగిస్తామని యూరప్ మంత్రి, ఫ్రెంచ్ రాయబారి జీన్ బాప్టిస్టే లెమినో తెలిపారు. మొత్తం 36 రాఫెల్ జెట్స్‌ను ఒకదాని తరువాత మరొకటి భారత్‌కు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. ‘‘రాఫెల్ ఒప్పందంపై జరుగుతున్న వివాదాలను మేము పట్టించుకోం. వాటిని భారత్‌కు కచ్చితంగా అప్పగిస్తా. భారత సార్వభౌమాదికారానికి ఈ విమానం ఒక సాధనం’’ […]
మోదీ, రాహుల్‌ల మధ్య రచ్చ రేపిన రాఫెల్ విమానాలు భారత గడ్డపై అడుగుపెట్టనున్నాయి. మొదటి రాఫెల్ యుద్ధ విమానాన్ని ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో భారత్‌కు అప్పగిస్తామని యూరప్ మంత్రి, ఫ్రెంచ్ రాయబారి జీన్ బాప్టిస్టే లెమినో తెలిపారు. మొత్తం 36 రాఫెల్ జెట్స్‌ను ఒకదాని తరువాత మరొకటి భారత్‌కు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. ‘‘రాఫెల్ ఒప్పందంపై జరుగుతున్న వివాదాలను మేము పట్టించుకోం. వాటిని భారత్‌కు కచ్చితంగా అప్పగిస్తా. భారత సార్వభౌమాదికారానికి ఈ విమానం ఒక సాధనం’’ అని లెమినో అభివర్ణించారు.
అయితే ఇటీవల ఫారిస్‌లోని రాఫెల్ విమాన తయారీ సంస్థపై దుండగులు చేసిన దాడి మీద దర్యాప్తు జరుగుతోందని వారు పేర్కొన్నారు. అయితే రాఫెల్ విమానాల కొనుగోలు ఒప్పందంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, రిలియన్స్ అధినేత అనిల్ అంబానీకి 30వేల కోట్ల రూపాయల ప్రయోజనం చేకూర్చడానికి మోదీ ప్రభుత్వం యత్నించిందని రాహుల్ చేసిన ఆరోపణ ఎన్నికల ముందు పెద్ద దుమారం రేపింది. అయితే ఈ ఒప్పందంలో ఎలాంటి అవినీతి జరగలేదని సుప్రీం కోర్టు, మోదీ ప్రభుత్వానికి క్లీన్‌చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే.