‘మీరొక్కరే వ్యాక్సిన్ తీసుకున్నారా ? నన్నెందుకు తీసుకువెళ్ళలేదు ?’ డాక్టర్ భర్తపై భార్య చిందులు

ఢిల్లీలో ఓ సీనియర్ డాక్టర్ తానొక్కడే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నందుకు తన భార్య ఆగ్రహాన్ని చవి చూశాడు. తన నిర్ణయాన్ని ఈ విషయాన్ని  ఫోన్ లో చెబుతూ లైవ్ గా ఫీడ్ చేశాడు.

  • Umakanth Rao
  • Publish Date - 6:46 pm, Wed, 27 January 21
'మీరొక్కరే వ్యాక్సిన్ తీసుకున్నారా ? నన్నెందుకు తీసుకువెళ్ళలేదు ?' డాక్టర్ భర్తపై భార్య చిందులు

ఢిల్లీలో ఓ సీనియర్ డాక్టర్ తానొక్కడే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నందుకు తన భార్య ఆగ్రహాన్ని చవి చూశాడు. తన నిర్ణయాన్ని ఈ విషయాన్ని  ఫోన్ లో చెబుతూ లైవ్ గా ఫీడ్ చేశాడు. ప్రముఖ కార్డియాలజిస్ట్, పద్మశ్రీ అవార్డు కూడా పొందిన కేకే.అగర్వాల్ అనే ఈయన ఆమెతో జరిపిన సంభాషణ రికార్డింగ్  తాలూకు వీడియో ట్విటర్ లో వైరల్ అవుతోంది.  ఐ యాం లైవ్ ఆన్ కెమెరా రైట్ నౌ అని ఆయన చెప్పినా ఆమె వినలేదు. తను టీకా మందు తీసుకున్నట్టు ఆయన చెప్పగానే ఆమె నన్ను కూడా ఎందుకు తీసుకువెళ్లలేదని ప్రశ్నించింది. అయితే వ్యాక్సిన్ ని చెక్ చేయడానికి వెళ్ళానని, కానీ సిబ్బంది..తనను కూడా తీసుకోవాలని కోరగానే అందుకు అంగీకరించానని అగర్వాల్ చెప్పారు. దీంతో మండిపడిన ఆయన భార్య… అబద్దాలు చెప్పవద్దని అరిచినంత పని చేసింది. నువ్వు తరువాత తీసుకోవచ్చు కదా అని ఆయన చెప్పినా ఆమె పట్టించుకోలేదు.   నేను లైవ్ లో ఉన్నా..మాట్లాడ వద్దు అని డాక్టర్ గారు అభ్యర్థించినా..నేను కూడా ఇపుడే లైవ్ లోకి వఛ్చి మీ సంగతి తేలుస్తా అని అవతలివైపు నుంచి ఆమె కేకలు పెట్టింది. ఈ సంభాషణ, ఈ డాక్టర్ అవస్థలపై అనేకమంది నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. టీవీలో లైవ్ లో ఉన్నప్పుడు మీ భార్యలతో మాట్లాడకండి అని ఒకరంటే మరొకరు … అగర్వాల్ పరిస్థితికి జాలిపడుతూ ట్వీట్లు చేశారు.

Read Also: మనం బాగా ఉన్నప్పుడు డాక్టర్ అలా చెప్తే నమ్మాలో లేదో కూడా తెలియదు… నటుడు రానా భావోద్వేగ సంభాషణ…
Read Also:ఐదు నెలల గర్భిణీతో అక్రమ సంబంధం.. ఆపై దారుణంగా హత్య..