Hyderabad: హైదరాబాద్‌లో ‘ఖమేనీ’ పేరుతో రోడ్డు ఉందని మీకు తెలుసా.? ఆ పేరు ఎలా వచ్చిందంటే
ఇరాన్-ఇజ్రాయిల్ మధ్య వార్ కొనసాగుతోంది. అటు ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీ ఈ యుద్ధంలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ యుద్ధం నేపధ్యంలో చాలా భయాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే.. దేశవ్యాప్తంగా ఓ చర్చ ప్రస్తుతం నడుస్తోంది. హైదరాబాద్‌లో ఖమేని పేరిట ఓ రోడ్డు ఉంది.

ఇప్పుడు ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా యుద్ధం గురించే చర్చ. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతమవుతున్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో ఒక పేరు మాత్రం పెను సంచలనం సృష్టిస్తోంది. అదే ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ పేరు. ఇటీవలి దాడుల్లో ఖమేనీ మృతి చెందడంతో యుద్ధం మరింత తారాస్థాయికి చేరుకుంది. ఇక్కడ మరింత ఆశ్చర్యపోయే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఖమేనీ పేరు మీద హైదరాబాద్ మహా నగరంలో ఏకంగా ఓ రోడ్డే ఉందట. ఏంటి.. వినడానికి చాలా వింతగా ఉంది కదూ..!
ఇరాన్ దాడుల నేపథ్యంలో అల్లకల్లోలమైన ప్రపంచ దేశాలను ఇప్పుడీ విషయం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. భాగ్యనగరంలో ‘ఖమేనీ’ రోడ్డు ఉందన్న విషయం తాజా దాడుల నేపథ్యంలో కొత్తగా బయటికి వచ్చింది. అయతొల్లా అలీ ఖమేనీ మరణ వార్త ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుండగా.. మరోవైపు, హైదరాబాద్ నగరంలో ఖమేనీ పేరుతో ఒక రోడ్డు ఉందన్న విషయం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. అది కూడా నగరంలోనే ప్రముఖంగా వినిపించే బంజారాహిల్స్‌లో ఈ పేరుతో రోడ్డు ఉండటం విశేషం. ఇక్కడే మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అయతొల్లా అలీ ఖమేనీ పేరు మీద నగరంలో రోడ్డు ఉందన్న విషయం వైరల్ అవుతున్న నేపధ్యంలో ప్రస్తుతం మరణించిన నేత పేరుతో కాకుండా ఇరాన్ తొలి సుప్రీం లీడర్ జ్ఞాపకార్థమే ఈ రోడ్డుకు ఈ పేరు పెట్టారని అసలు విషయం బయటపడింది. ఈ విషయం మాకు ఇప్పటివరకూ తెలియదని, ఖమేనీ మరణం తర్వాతే ఇలాంటి ఆశ్చర్యం కలిగించే కొత్త విషయాలు బయటికి వస్తున్నాయని నెటిజన్లు అంటున్నారు.
ఇంతకీ హైదరాబాద్ నగరంలో ఈ రోడ్డు ఎక్కడ ఉందనే కదా ఇప్పుడు మీ అనుమానం..! GVK One మాల్ ఎదురుగా ఉండే బంజారాహిల్స్ రోడ్డు నెం.7ని అధికారికంగా ‘ఇమామ్ ఖమేనీ రోడ్’ అని పిలుస్తారు. ఇదే ప్రాంతంలో ఇరాన్ కాన్సులేట్ కార్యాలయం ఉండటంతో అప్పటి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఈ రోడ్డుకు ఈ పేరును పెట్టినట్లు సమాచారం. కుతుబ్ షాహీల కాలం నుంచి హైదరాబాద్, ఇరాన్ దేశాల మధ్య ఉన్న ధృడమైన సాంస్కృతిక, వాణిజ్య సంబంధాలకు గుర్తుగా అప్పటి అధికారులు ఈ నిర్ణయం తీసుకోవడమే కాకుండా అప్పటి ప్రభుత్వం ఈ పేరును అధికారికంగా రికార్డుల్లో కూడా చేర్చింది.
ఖమేనీ పేరుతో ఎందుకింత ధృడ సంబంధం.?
ఇరాన్ మొదటి సుప్రీం లీడర్ రుహొల్లా ఖమేనీ పూర్వీకులకు మన దేశంతో విడదీయలేని సంబంధాలు ఉండేవి. ఖమేనీ తాతలు ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాకు చెందిన కింతూరులో పుట్టారని చరిత్రకారులు చెబుతున్న మాట. 19వ శతాబ్దంలోనే ఖమేనీ పూర్వీకులు ఇరాన్‌కు వలస వెళ్లి అక్కడే రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడంతో ఈ సంబంధం ఇలా కొనసాగింది. అయితే.. తాజా దాడుల ఘటనలో అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతి చెందాడు. డౌన్‌టౌన్‌లోని ఖమేనీ కాంపౌండ్ లక్ష్యంగా ఫిబ్రవరి 28న ఖమేనీతో పాటు ఆయన కుమార్తె, అల్లుడు, కోడలు, మనవరాలు ప్రాణాలు కోల్పోయారు. ఖమేనీ ఇరాన్ మరింత అట్టుడికిపోయింది. తమ దేశంపై దాడి చేసిన ఇజ్రాయెల్, అమెరికాలను వదిలే ప్రసక్తే లేదని ప్రకటన కూడా విడుదల చేసింది. ఈ క్రమంలో శత్రుదేశాల మధ్య పోరు మరింత తీవ్ర రూపం దాల్చింది. ఇదంతా ఇలా ఉండగా.. ఖమేనీ మరణం తర్వాత హైదరాబాద్ నగరంలో ఓ రోడ్డు ఉందనే విషయాన్ని ఓ నెటిజన్ తన ఫేస్బుక్ పేజీ ద్వారా వెల్లడించడంతో ఇక అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఈ వార్త తెగ వైరల్ అవుతోంది.
ఇది చదవండి: మ్యాజిక్ రైస్ బాబోయ్.! వండకుండానే క్షణాల్లో అన్నం రెడీ.. నీళ్లు పోస్తే చాలు
