ఎమ్మెల్యే సెల్వంను బహిష్కరించిన డీఎంకే
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే పార్టీకి చెందిన ఎమ్మెల్యేపై వేటుపడింది. థౌజండ్స్ లైట్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కు.కా.సెల్వంను డీఎంకే నుంచి బహిష్కరించింది.
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే పార్టీకి చెందిన ఎమ్మెల్యేపై వేటుపడింది. థౌజండ్స్ లైట్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కు.కా.సెల్వంను డీఎంకే నుంచి బహిష్కరించింది. ఇటీవల బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను ఢిల్లీలో సెల్వం కలుసుకున్నారు. ఈ నేపథ్యంలో డీఎంకే అధిష్టానం కొద్దిరోజులుగా సెల్వంపై గుర్రుగా ఉంది. దీంతో సెల్వంపై చర్యలు చేపడుతూ మొదట పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ షోకాజ్ నోటీసు జారీ చేసింది. పార్టీ అధ్యక్షుడు ఎం.కె.స్టాలిన్ ఓ ప్రకటన ద్వారా స్పందిస్తూ… షోకాజ్ నోటీసులకు సెల్వం నుంచి సరైన సమాధానం రాలేదన్నారు. సమాధానం సంతృప్తికరంగా లేనందున క్రమశిక్షణా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పార్టీ ధిక్కరణ చర్యల్లో భాగంగా సెల్వంను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే హై లెవల్ ఎగ్జిక్యూటివ్ కమిటి నుంచి అదేవిధంగా పార్టీ హెడ్‌క్వార్టర్స్ ఆఫీస్ సెక్రటరీ పదవి నుంచి సెల్వంను తొలగించారు. మరోవైపు సెల్వం బీజేపీకి అనుకూలంగా ఉంటూ త్వరలోనే ఆ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నట్లు సమాచారం.