10 నెలల చిన్నారికి ‘శానిటైజర్ నీళ్లిచ్చిన’ ఆశావర్కర్
త్రిపురలో దారుణం జరిగింది. ఈ రాష్ట్రంలోని 'ఉనాకోటి' జిల్లా సోనామురాగ్రామంలో గల హెల్త్ కేర్ సెంటర్ లో పోలియో వ్యాక్సిన్ కోసం పది నెలల శిశువుతో వచ్చిందో తల్లి. అదే పనిగా ఏడుస్తున్న తన చిన్నారికి నీళ్లివ్వమని ఆమె ఓ ఆశా వర్కర్ ని కోరగా....
త్రిపురలో దారుణం జరిగింది. ఈ రాష్ట్రంలోని ‘ఉనాకోటి’ జిల్లా సోనామురాగ్రామంలో గల హెల్త్ కేర్ సెంటర్ లో పోలియో వ్యాక్సిన్ కోసం పది నెలల శిశువుతో వచ్చిందో తల్లి. అదే పనిగా ఏడుస్తున్న తన చిన్నారికి నీళ్లివ్వమని ఆమె ఓ ఆశా వర్కర్ ని కోరగా..ఆమె శానిటైజర్ కలిపిన నీటిని ఇచ్చింది. అది తాగిన పసికందు ఆరోగ్యం ఆందోళనకరంగా మారడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక విచారణలో ఆశావర్కర్ చేసింది పొరబాటేనని తెలుసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శిశువు హెల్త్ నిలకడగా ఉన్నట్టు వెల్లడైంది.
అయితే శానిటైజర్ కలిపిన నీటిని ఆశావర్కర్ ఎందుకు ఇచ్చిందో, అసలు ఆమెకు తెలిసే ఇచ్చిందా లేక తెలియదా అన్న విషయాలపై ఆరా తీయని అధికారులు కేవలం ఇది పొరబాటే అని చెప్పడం వెనుక ఏదో మర్మం దాగుందని అంటున్నారు. ఆమెను మందలించకుండా ఇది మిస్టేక్ అని చెప్పి చేతులు దులుపుకున్నారట వారు. గ్రామాల్లో నిరక్షరాస్యులను ఇలా ఆశావర్కర్లుగా నియమించుకుంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.