ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు.. నిలిచిపోయిన రాకపోకలు!
ఎడతెరిపిలేని వర్షాలతో ఉత్తరాఖండ్ తీవ్రంగా ప్రభావితమైంది. భారీ వర్షాలకు చాలాప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతుండగా నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. చమోలీ జిల్లాలో కుండపోత వర్షానికి కొండచరియలు
ఎడతెరిపిలేని వర్షాలతో ఉత్తరాఖండ్ తీవ్రంగా ప్రభావితమైంది. భారీ వర్షాలకు చాలాప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతుండగా నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. చమోలీ జిల్లాలో కుండపోత వర్షానికి కొండచరియలు విరిగిపడుతుండడంతో స్థానికులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. బద్రీనాథ్ జాతీయరహదారితోపాటు పలు రహదారులపై రాకపోకలు నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలకు వరద పొటెత్తడంతో అలకనంద, పిందేర్, నందాకిని నదులు ప్రమాదకరస్థాయికి అతి చేరువలో ప్రవహిస్తున్నామని ఆ జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు.
కాగా.. పితోర్‌ఘర్, ధర్చాలా జిల్లాలో చాలారోడ్లపై కొండచరియలు విరిగిపడ్డాయి. అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని సబ్ డివిజన్ మేజిస్ట్రేట్ అనిల్ కుమార్ శుక్లా తెలిపారు. జాతీయ విపత్తు స్పందనా దళాలు, రాష్ట్ర విపత్తు స్పందనా దళాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. కూలిపోయిన విద్యుత్ స్తంభాలను సిబ్బంది సరి చేస్తున్నారు. ఇదిలాఉండగా రానున్న 48 గంటల్లో పితోర్‌ఘర్, భాగేశ్వర్, చమోలీ, నైనిటాల్, ఉదమ్‌సింగ్ నగర్, పౌరీ, తెహ్రీ, డెహ్రాడూన్, హరిద్వార్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
[svt-event date=”13/08/2020,2:40PM” class=”svt-cd-green” ]
#WATCH Heavy rainfall lashes Dehradun, #Uttarakhand India Meteorological Department has predicted “partly cloudy sky with possibility of heavy rain or thunderstorm” in the district today pic.twitter.com/maeGHMulCp
— ANI (@ANI) August 13, 2020
[/svt-event]
Read More: