రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారుః డీకే అరుణ
తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారనడానికి దుబ్బాక ఎన్నికలు నిదర్శనమని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు.

తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారనడానికి దుబ్బాక ఎన్నికలు నిదర్శనమని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. దుబ్బాకలో బీజేపీ గెలుపుతో రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరిగిన సంబురాల్లో పాల్గొన్న అరుణ.. వచ్చే 2023 అసెంబ్లీ ఎన్నికల నాటికి టీఆర్ఎస్ కు బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల ప్రజలు విసిగిపోయారనడానికి దుబ్బాక ఉపఎన్నిక ఫలితమే చెబుతుందన్నారు. టీఆర్ఎస్ పై రాష్ట్ర ప్రజలు నమ్మకం కోల్పోయి బారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారని డీకే అరుణ తెలిపారు.