AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్లోనే నేచురల్ ఫ్లోర్ క్లీనర్ తయారు చేయడం ఎలా? మార్బుల్, టైల్స్ మెరిపించే అద్భుతమైన చిట్కాలు

పండుగల సమయం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరూ తమ ఇళ్లను అత్యంత శుభ్రంగా, అందంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా దీపావళి వేళల్లో ఇళ్లలో డీప్ క్లీనింగ్ ముమ్మరంగా సాగుతుంది. అయితే, రోజూ ఇల్లు తుడిచినా మార్బుల్, టైల్స్ పైన ఉండే జిడ్డు, మురికి సులభంగా వదలవు. పైగా మార్కెట్లో లభించే రసాయనాలతో కూడిన ఫ్లోర్ క్లీనర్‌ల వల్ల ఫ్లోర్ మరింత జిగటగా మారుతుంది. అలాగే దోమలు, ఈగలు, చీమల బెడద కూడా విపరీతంగా వేధిస్తుంది. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టడానికి ఇంట్లోనే తక్కువ ఖర్చుతో సహజమైన ఫ్లోర్ క్లీనర్ తయారు చేసుకునే అద్భుతమైన మార్గం ఇక్కడ ఉంది.

ఇంట్లోనే నేచురల్ ఫ్లోర్ క్లీనర్ తయారు చేయడం ఎలా? మార్బుల్, టైల్స్ మెరిపించే అద్భుతమైన చిట్కాలు
Natural Floor Cleaner
Jyothi Gadda
|

Updated on: Nov 05, 2026 | 3:57 PM

Share

ఇంట్లోని మార్బుల్, టైల్స్ అద్దంలా మెరిసేలా చేసుకోవడానికి, ఈగలు, దోమలు, చీమల బెడద నుంచి విముక్తి పొందడానికి ఇంట్లోనే సులభంగా నేచురల్ ఫ్లోర్ క్లీనర్ తయారు చేసుకోవచ్చు. దీనికోసం మనకు ఈజీగా అందుబాటులో ఉండే అతి తక్కువ ఖర్చులో లభించే పదార్థాలు ఉంటే సరిపోతుంది. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని నీటిలో కలిపి ఇల్లు తుడిస్తే ఫ్లోర్ జిగటగా మారకుండా శుభ్రంగా ఉంటుంది. మార్కెట్లో లభించే ఖరీదైన కెమికల్ క్లీనర్‌లకు బదులుగా ఈ సహజ పద్ధతిని అనుసరించడం వల్ల ఇల్లు తళతళలాడటంతో పాటు మంచి సువాసన వెదజల్లుతుంది. ఇది పూర్తిగా సురక్షితమైన, చౌకైన చిట్కా. తయారీ విధానం, కావాల్సిన పదార్థాలేంటో వివరంగా తెలుసుకుందాం..

నేచురల్ ఫ్లోర్ క్లీనర్ తయారీకి కావలసిన పదార్థాలు:

కావాల్సినన్ని తాజా వేపాకులు

2 చిన్న కర్పూర బిళ్లలు

ఇవి కూడా చదవండి

2 నాఫ్తలీన్ (కర్పూర ఉండలు) గుళికలు

2 టేబుల్ స్పూన్ల సాధారణ తెల్ల ఉప్పు

4 గ్లాసుల గోరువెచ్చని నీరు

క్లీనర్ తయారీ విధానం:

మొదటగా ఒక గిన్నెలో మూడు గ్లాసుల నీటిని తీసుకుని, అందులో వేపాకులను వేసి 8 నుంచి 10 నిమిషాల పాటు బాగా మరిగించాలి. ఆ తర్వాత నీటిని కొద్దిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు నాఫ్తలీన్ గుళికలు, కర్పూరాన్ని మెత్తగా పొడి చేసుకోవాలి. ఒక పాత ప్లాస్టిక్ లేదా గాజు పాత్రలో ఈ గోరువెచ్చని వేపాకుల నీటిని పోయాలి. అందులో సిద్ధం చేసుకున్న కర్పూరం పొడి, నాఫ్తలీన్ పొడి, ఉప్పు కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒకటి రెండు నిమిషాల పాటు బాగా కలపాలి. ఆ తర్వాత మరో గ్లాసు గోరువెచ్చని నీటిని జోడించి చక్కటి ద్రావణాన్ని తయారు చేసుకోవాలి. ఈ నేచురల్ క్లీనర్‌ను ఒక సీసాలో భద్రపరుచుకోవచ్చు.

ఇల్లు తుడిచే విధానం, ప్రయోజనాలు:

మీరు ఇల్లు తుడిచే ప్రతిసారీ, నీటి బకెట్‌లో ఈ తయారు చేసుకున్న క్లీనర్ నుండి 1 లేదా 2 మూతలను కలపాలి. సాధారణంగా ఇల్లు తుడిచినట్లే ఈ నీటితో పోక్షా పెట్టాలి. ఈ సహజ సిద్ధమైన క్లీనర్‌ను వాడటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కర్పూరం వాసనకు ఇల్లంతా సువాసన వెదజల్లుతుంది. వేపాకులు, ఉప్పు ప్రభావం వల్ల ఇళ్లలో ఉండే హానికరమైన క్రిములు, ఈగలు, దోమలు, చీమలు పూర్తిగా దూరంగా ఉంటాయి. రసాయనాల ప్రభావం లేకుండా తక్కువ ఖర్చుతో ఫ్లోర్ అద్దంలా మెరిసిపోతుంది. ప్రతిరోజూ ఈ పద్ధతిని పాటించడం ద్వారా ఇల్లు పరిశుభ్రంగా, ఆరోగ్యకరమైన వాతావరణంతో ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us