లాక్ డౌన్ నుంచి కోలుకునేందుకు.. ఎంత సమయం పడుతుందంటే..

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. ప్రపంచ దేశాలన్ని లాక్ డౌన్ విధించాయి. అయితే.. కరోనా నుంచి తొందరగా బయటపడే అవకాశం భారత్‌కే ఉందని ప్రపంచ స్థాయి కంపెనీల

లాక్ డౌన్ నుంచి కోలుకునేందుకు.. ఎంత సమయం పడుతుందంటే..
Follow us

| Edited By:

Updated on: May 01, 2020 | 3:25 PM

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. ప్రపంచ దేశాలన్ని లాక్ డౌన్ విధించాయి. అయితే.. కరోనా నుంచి తొందరగా బయటపడే అవకాశం భారత్‌కే ఉందని ప్రపంచ స్థాయి కంపెనీల సీఈవోలు విశ్వాసం వ్యక్తం చేశారు. దేశంలోని 200 కంపెనీల సీఈవోలు, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లను భాగస్వామ్యం చేస్తూ ‘ఎగ్జిక్యూటివ్‌ యాక్సెస్‌ ఇండియా’ సంస్థ తాజాగా సర్వే నిర్వహించింది.

వివరాల్లోకెళితే.. ఈ సర్వేలో.. ఇతర దేశాల కంటే భారత మార్కెట్‌ త్వరగా కోలుకుని పూర్వ స్థితికి చేరుకుంటుందని సీఈవోలు, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సర్వేలో ప్రధానంగా కంపెనీల సీఈవోలు సంక్షోభ నివారణ ప్రణాళికలకే తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. 65 శాతం మంది సీఈవోలు, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు ఇదే విషయాన్ని చెప్పారు. లాక్‌డౌన్‌ అనంతరం పని విధానంలో తీసుకు రావాల్సిన మార్పులపై ఆలోచన చేస్తున్నామని 59 శాతం మంది చెప్పారు.

మరోవైపు.. వర్క్‌ ఫ్రం హోం, అందుకోసం వర్చ్యువల్‌ టీమ్‌ల ఏర్పాటు తదితర ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. పని విధానంలో టెక్నాలజీని మరింతగా వినియోగించుకోవడంపై దృష్టి సారించినట్లు 57 శాతం మంది చెప్పారు. వినియోగదారుల పరిధిని విస్తృతం చేసుకోవడానికి 48శాతం మంది మద్దతు తెలియజేశారు.