ఇరాక్‌లో పారామిలటరీ దళాల దాడి.. ఏడుగురు ఉగ్రవాదులు హతం..

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలన్ని లాక్ డౌన్ విధించాయి. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను అణచివేసేందుకు ఇరాకీ మిలటరీ దళాలు దాడులు చేశాయి.

ఇరాక్‌లో పారామిలటరీ దళాల దాడి.. ఏడుగురు ఉగ్రవాదులు హతం..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 01, 2020 | 4:36 PM

IS militants: కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలన్ని లాక్ డౌన్ విధించాయి. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను అణచివేసేందుకు ఇరాకీ మిలటరీ దళాలు దాడులు చేశాయి. ఇరాక్ దేశంలోని సలహుద్దీన్ ప్రావిన్సులోని హిమ్రీన్ పర్వతాలపై ఐఎస్ ఉగ్రవాదులు దాక్కుని  ఉండగా ఇరాకీ పారామిలటరీ దళం హెలికాప్టరులో వచ్చి కాల్పుల వర్షం కురిపించింది. ఈ దాడిలో ఏడుగురు ఐఎస్ ఉగ్రవాదులు మరణించారని ఇరాక్ అధికారులు చెప్పారు.

కాగా.. హిమ్రీన్ పర్వతాలపై ఉన్న ఉగ్రవాదుల రహస్యస్థావరంలో ఆయుధాలు, పెద్దఎత్తున మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని ఇరాక్ ఆర్మీ ప్రతినిధి హషద్ షాబీ చెప్పారు. హిమ్రీన్ పర్వతాలపై ఇరాకీ మిలటరీ దళాలు పలుసార్లు దాడులు చేస్తున్నా ఐఎస్ ఉగ్రవాదుల రహస్య స్థావరాలు కొనసాగుతూనే ఉన్నాయని మిలటరీ అధికారులు చెప్పారు.