‘మహాభారతం’ చిత్రంపై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా వ్యాప్తంగా.. 'రాజమౌళి మేక్ రామాయన్.. అనే హ్యాష్ ట్యాగ్' ట్రెండింగ్ అవుతోన్న విషయం తెలిసిందే. మరి రాజమౌళి రామాయణం చేస్తారో లేదో తెలీదు కానీ.. మహాభారతం మాత్రం ఆయన కల అని ఇప్పటికే..

  • Tv9 Telugu
  • Publish Date - 2:13 pm, Tue, 5 May 20
'మహాభారతం' చిత్రంపై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా వ్యాప్తంగా.. ‘రాజమౌళి మేక్ రామాయన్.. అనే హ్యాష్ ట్యాగ్’ ట్రెండింగ్ అవుతోన్న విషయం తెలిసిందే. మరి రాజమౌళి రామాయణం చేస్తారో లేదో తెలీదు కానీ.. మహాభారతం మాత్రం ఆయన కల అని ఇప్పటికే పలుమార్లు వివిధ ఇంటర్వ్యూల్లో చెబుతూ వచ్చారు. ఈ సందర్భంగా వీటిపై రాజమౌళి స్పందించారు. ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ఈ విరామంలో మహాభారతం సినిమాకి సంబంధించి ఏమైనా పనులు మొదలు పెట్టారా? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు రాజమౌళి ఇలా సమాధానమిచ్చారు.

‘అవును నిజంగానే మహాభారతం సినిమా తీయాలనేది నా కల. ఎప్పటికైనా తెరకెక్కించి తీరాలి. దానికి సంబంధించి పనులు మొదలు పెట్టాలి. అయితే కొంచెం సమయం పడుతుంది. ఇప్పుడు సమయం దొరికింది కదా అని ఇప్పటికిప్పుడు దాని మీద కూర్చొని పని చేసే ప్రాజెక్ట్ కాదది. చాలా శక్తి సామర్థ్యాలు పెంపొందించుకోవాలి. పూర్తిగా దానిపైనే దృష్టి పెట్టాలి. అప్పుడు కానీ దాన్ని మొదలు పెట్టలేమని చెప్పుకొచ్చారు రాజమౌళి’. కాగా ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో ఆర్ఆర్ఆర్ తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. అయితే లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా చిత్రీకరణ మధ్యలోనే ఆగిపోయింది.

Read More:

షాపుల ముందు మందు బాబుల క్యూ లైన్‌ చూసి షాక్‌ అయిన చంద్రబాబు!

పేగులపై కరోనా వైరస్ దాడి.. మళ్లీ ఇదో కొత్త టెన్షన్!