అచ్చు ‘కోయంబేడు’లాగే.. తెలంగాణలోని ‘గుడిమల్కాపూర్’ మార్కెట్‌కి ‘కరోనా’ షాక్..!
తెలంగాణలో అతిపెద్ద మార్కెట్ సెంటర్ గుడిమల్కాపూర్‌కి కరోనా షాక్ తగిలింది. మార్కెట్‌లో ఒకేసారి మూడు పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.

తెలంగాణలో అతిపెద్ద మార్కెట్ సెంటర్ గుడిమల్కాపూర్‌కి కరోనా షాక్ తగిలింది. మార్కెట్‌లో ఒకేసారి మూడు పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో మార్కెట్ వ్యాపారులు, కొనుగోలుదారులు షాక్ తిన్నారు. మార్కెట్‌ని యుద్ధ ప్రాతిపదికన అధికారులు మూసివేశారు. మరోవైపు పాజిటివ్ కేసుల పూర్తి కాంటాక్స్‌ని ఛేదించే పనిలో అధికారులు పడ్డారు. మార్కెట్ ని మూసివేయడం తో గుడిమల్కాపూర్ నిర్మానుశంగా మారింది. కాగా కాయగూరలు, పూల మార్కెట్‌కు రాష్ట్రంలోనే అతి పెద్ద సెంటర్‌గా గుడిమల్కాపూర్‌కి పేరుంది. ఇదిలా ఉంటే ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్‌గా పేరు పొందిన కోయంబేడు మార్కెట్ కి ఇలాంటి షాక్ తగిలింది. సోమవారం నమోదైన 527 కొత్త కేసులలో 400 లకు పైగా కేసులు కోయంబేడులో పనిచేసిన కార్మికులు, వారిని కలిసిన వారివే కావడంతో తమిళనాట కలకలం రేగింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వారితో కాంటాక్ట్ అయిన వారిని చేధించే పనిలో పడ్డారు.
Read This Story Also: కరోనా భయంతో క్వారంటైన్‌లో ఆత్మహత్య చేసుకున్న వలస కూలీ..!