గౌరవనీయులైన నారా లోకేష్‌.. మీరో ఫెయిల్యూర్ నాయకుడు.. ప్రేమతో మీ బండ్ల!

గౌరవనీయులైన నారా లోకేష్‌.. మీరో ఫెయిల్యూర్ నాయకుడు.. ప్రేమతో మీ బండ్ల!

లాక్‌డౌన్ సమయంలో ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉన్నారు నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌. అక్కడ కరోనాపై మాత్రమే కాకుండా రాజకీయాలపై కూడా ఆయన స్పందిస్తున్నారు.

TV9 Telugu Digital Desk

| Edited By:

May 05, 2020 | 3:17 PM

లాక్‌డౌన్ సమయంలో ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉన్నారు నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌. అక్కడ కరోనాపై మాత్రమే కాకుండా రాజకీయాలపై కూడా ఆయన స్పందిస్తున్నారు. మొన్నటికి మొన్న తెలంగాణ రాజకీయ నాయకులను చూసి నేర్చుకోవాలంటూ ఏపీ పొలిటికల్ లీడర్లకు క్లాస్ పీకిన బండ్ల.. తాజాగా నారా లోకేష్‌ను టార్గెట్‌ను చేశారు. ఈ మేరకు ఆయన గురించి చాలా ట్వీట్లే చేశారు. అందులో నారా లోకేష్‌ ఫెయిల్యూర్ రాజకీయ నాయకుడు అంటూ తన అభిమతాన్ని వ్యక్తపరిచారు.

”గౌరవనీయులైన నారా లోకేష్ గారికి ప్రేమతో. రాజకీయాలు అంటే నాకు చాలా ఇష్టం. కానీ అది చాలా కష్టమని వదిలేశా. రాజకీయనాయకుడి లక్షణాలు.. దమ్ము, ధైర్యం, ప్రజల్లో నమ్మకం, పోరాడుతాడు అన్న విశ్వాసం కల్పించడం. ఈ ప్రపంచలో అతి కొద్ది మందికి మాత్రమే దక్కే అదృష్టం మీకు దక్కడం నిజంగా మీ అదృష్టం. చంద్రబాబు నాయుడు కుమారుడిగా మీరు పుట్టడం. రాజకీయ పార్టీ అంటే ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ కాదు మన దగ్గర మన పార్టీలో నాయకులు అందరూ మన దగ్గర ఎంప్లాయిస్ కాదు. ప్రతి ఒక్కరిని ప్రేమించి, ప్రేమను పంచి మనలో ఒకరిగా చేసుకొని ప్రజలకు సేవ చేయాలి అని అనుకుంటాను. మీ ప్రవర్తన ఎలా ఉండాలంటే మీ తండ్రి మీ గురించి గర్వంగా నిద్రపోయే రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మధ్య ట్విట్టర్ లో మీరు చేస్తున్న కామెంట్లు మిమ్మల్ని ఇష్టపడే చాలామంది బాధపడుతున్నారు. మీరు అద్భుతంగా పనిచేసి ప్రజలలో నారా లోకేష్ తండ్రి చంద్రబాబు నాయుడు అని చెప్పుకునే విధంగా మీ రాజకీయ ఉండాలని మీరు ఆ విధంగా ప్రజా పోరాటం లో భాగం కావాలని కోరుకుంటున్నాను. ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారికి సమకాలికుడు గా పనిచేసిన ఆయన మంత్రివర్గంలో పనిచేసిన గౌరవనీయులు ముఖ్యమంత్రి కెసిఆర్ గారి కుమారుడు కేటీఆర్ లాగా ఉండాలి. నాకిష్టమైన నా రాజకీయ నాయకుడు గౌరవనీయులు నారా చంద్రబాబునాయుడు గారు తన నలభై ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో ఎన్నో విజయాలు ఎన్నో కష్టాలు ఎదుర్కొని ధైర్యంగా పోరాడుతూ ఉంటారు. తండ్రి చనిపోయిన తర్వాత ప్రత్యర్థులు అందరూ ఒక్కటై అణచివేయాలని చూసిన అందర్నీ ఎదిరించి తొమ్మిది సంవత్సరాల పాటు సుదీర్ఘంగా పోరాడి ఘన విజయం సాధించిన వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉండాలని కోరుకుంటున్నాను. మిమ్మల్ని చూస్తుంటే నాకు భయమేస్తుంది రాజకీయాల్లో పట్టు సాధించలేరు ఏమోనని కానీ మీరు నంబర్ వన్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రాంచరణ్ లాగా తండ్రికి పోటీ ఇచ్చే విధంగా మీరు కూడా తయారవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మొన్నీమధ్య తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ స్వామివారి దర్శనం చేసుకుని బయటకు వస్తే మీరు చేసిన ట్వీట్ మీ దిగజారుడుతనానికి. రాజకీయనాయకులకి మూడు కావాలి ఒకటి వాళ్ళ పై వాళ్ళ నమ్మకం . రెండు వారి దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరు నమ్మి రావడం . మూడు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని వీళ్ళ నమ్మటం. నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు ఎవరితో అనుబంధము లేదు కానీ మీరంటే మీ నాన్నగారి అంటే నా గౌరవం మీ తాతగారు అంటే నాకెంతో ప్రేమ అందుకోసమే మీకు ఈ విన్నపం. ఎవరు ఏ విధమైన సపోర్ట్ చేయకపోయినా నా నంబర్ వన్ పొజిషన్ కి వచ్చినా యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాగా మీరు వుండాలి. చంద్రబాబు నాయుడు కుమారుడు గా తప్ప రాజకీయంగా గా మీకు ఏ అర్హత లేదు ఎందుకంటే నాకు తెలిసి మీరు రాజకీయంగా ఫెయిల్యూర్ నాయకుడు. ప్రేమతో మీ బండ్ల గణేష్” అని ట్వీట్ చేశాడు.

Read This Story Also: అచ్చు ‘కోయంబేడు’లాగే.. తెలంగాణలోని ‘గుడిమల్కాపూర్’‌ మార్కెట్‌కి ‘కరోనా’ షాక్‌..!

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu