ఇమ్రాన్ ఖాన్‌కు సవాలు విసిరిన దిగ్విజయ్ సింగ్

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడిపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందనకు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కౌంటర్ ఇచ్చారు. ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాదులను ఇమ్రాన్ ఖాన్‌ను నియంత్రించలేడా అని ప్రశ్నించారు. ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయ్యద్, పుల్వామా దాడి సూత్రదారి మసూద్ అజహర్‌లను భారత్‌కు అప్పగించి తన ధైర్యాన్ని ఇమ్రాన్ ఖాన్ నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. ఒకవేళ అలా చేస్తే పాకిస్థాన్ ఆర్ధిక సంక్షోభం నుంచి బయటపడుతుంది, అంతేకాక ఇమ్రాన్ ఖాన్‌కు నోబెల్ శాంతి […]

ఇమ్రాన్ ఖాన్‌కు సవాలు విసిరిన దిగ్విజయ్ సింగ్
Follow us

| Edited By:

Updated on: Oct 18, 2020 | 9:18 PM

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడిపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందనకు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కౌంటర్ ఇచ్చారు. ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాదులను ఇమ్రాన్ ఖాన్‌ను నియంత్రించలేడా అని ప్రశ్నించారు. ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయ్యద్, పుల్వామా దాడి సూత్రదారి మసూద్ అజహర్‌లను భారత్‌కు అప్పగించి తన ధైర్యాన్ని ఇమ్రాన్ ఖాన్ నిరూపించుకోవాలని సవాల్ విసిరారు.

ఒకవేళ అలా చేస్తే పాకిస్థాన్ ఆర్ధిక సంక్షోభం నుంచి బయటపడుతుంది, అంతేకాక ఇమ్రాన్ ఖాన్‌కు నోబెల్ శాంతి బహుమతి కూడా వస్తుందని సోషల్ మీడియాలో అన్నారు. ఈ విషయంలో ఇమ్రాన్ ఖాన్‌కు నవజోత్ సింగ్ సిద్ధూ సలహా ఇవ్వాలని, ఇద్దరూ స్నేహితులే కాబట్టి మాట్లాడాలని సిద్ధూకి దిగ్విజయ్ సూచించారు. కశ్మీరీలను ఇబ్బందులకు గురి చేయొద్దని, కశ్మీర్ మనకు కశ్మీరీలతో పాటు కావాలా? వాళ్లు లేకుండానే కావాలా? అనే విషయాన్ని ఆలోచించాలని ద్విగ్విజయ్ అన్నారు.