అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్‌పై నిందలు వేసిన పాక్

అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్‌పై నిందలు వేసిన పాక్

ది హేగ్: అంతర్జాతీయ న్యాయస్థానం వేదికగా భారత్‌పై పాకిస్థాన్‌ నిందలు వేసింది. 2014లో జరిగిన పెషావర్‌ ఉగ్రదాడిలో భారత హస్తం ఉందంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. సైనిక పాఠశాలపై జరిగిన ఆ ఉగ్రదాడి కారణంగా తాము 140 మంది చిన్నారులను కోల్పోయామని, ఈ దాడికి భారత్ స్పాన్సర్ చేసిందని వాదించింది. కుల్‌భూషణ్‌ జాదవ్‌ కేసు విచారణ సందర్భంగా అంతర్జాతీయ న్యాయస్థానంలో పాక్‌ ఈ వ్యాఖ్యలు చేసింది. పాక్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ […]

Vijay K

| Edited By:

Oct 18, 2020 | 9:46 PM

ది హేగ్: అంతర్జాతీయ న్యాయస్థానం వేదికగా భారత్‌పై పాకిస్థాన్‌ నిందలు వేసింది. 2014లో జరిగిన పెషావర్‌ ఉగ్రదాడిలో భారత హస్తం ఉందంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. సైనిక పాఠశాలపై జరిగిన ఆ ఉగ్రదాడి కారణంగా తాము 140 మంది చిన్నారులను కోల్పోయామని, ఈ దాడికి భారత్ స్పాన్సర్ చేసిందని వాదించింది. కుల్‌భూషణ్‌ జాదవ్‌ కేసు విచారణ సందర్భంగా అంతర్జాతీయ న్యాయస్థానంలో పాక్‌ ఈ వ్యాఖ్యలు చేసింది.

పాక్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌ కేసుకు సంబంధించి అంతర్జాతీయ న్యాయస్థానం సోమవారం నుంచి విచారణ ప్రారంభించింది. ఈ సందర్భంగా పాకిస్థాన్‌ కౌన్సిల్‌ తన వాదనలు వినిపించింది. కుల్‌భూషణ్‌ జాదవ్‌తో బలూచిస్థాన్‌లో దాడులు చేయాలని భారత ప్రభుత్వం ప్రయత్నించింది. జాదవ్‌ రా అధికారి. విచారణలో ఈ విషయాన్ని జాదవ్‌ స్వయంగా ఒప్పుకొన్నాడు.

ఆత్మాహుతి దాడులు జరిపి పాక్‌లో గందరగోళం సృష్టించేందుకు జాదవ్‌ అనేక మందిని కలిశాడు. అజిత్ దోవల్‌ మార్గ నిర్దేశకత్వంలోనే జాదవ్‌ ఈ పనులన్నీ చేశాడు. జాదవ్‌ను ఇరాన్‌ నుంచి కిడ్నాప్‌ చేశామని భారత్‌ చెప్పడం హాస్యాస్పదం. భారత్‌ నిజాన్ని దాచాలని చూస్తోంది’ అని పాకిస్థాన్‌ కౌన్సిల్‌ ఆరోపించింది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu