అంబానీ ఇంట మళ్లీ పెళ్లి బాజాలు

అంబానీ ఇంట మళ్లీ పెళ్లి బాజాలు

ముంబయి: ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ నివాసం ఆంటీలియా మరో పెళ్లి వేడుకకు సిద్ధం అవుతోంది. ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతా వివాహం మార్చి 9న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ లోగా అనేక సంబరాలకు అంబానీ, మెహతా కుటుంబాలు వేదిక కానున్నాయి. సోమవారం రాత్రి ఆంటీలియాలో మ్యూజికల్ నైట్‌తో  ఈ వేడుకులు షురూ అయ్యాయి. గార్బా సింగర్‌ ఫల్గుణి పాథక్ ఈ మ్యూజికల్ నైట్‌లో ప్రదర్శన ఇచ్చారు. దానిలో ఇరు కుటుంబాలు రాత్రి మొత్తం […]

Ram Naramaneni

| Edited By: Srinu Perla

Mar 07, 2019 | 7:15 PM

ముంబయి: ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ నివాసం ఆంటీలియా మరో పెళ్లి వేడుకకు సిద్ధం అవుతోంది. ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతా వివాహం మార్చి 9న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ లోగా అనేక సంబరాలకు అంబానీ, మెహతా కుటుంబాలు వేదిక కానున్నాయి. సోమవారం రాత్రి ఆంటీలియాలో మ్యూజికల్ నైట్‌తో  ఈ వేడుకులు షురూ అయ్యాయి. గార్బా సింగర్‌ ఫల్గుణి పాథక్ ఈ మ్యూజికల్ నైట్‌లో ప్రదర్శన ఇచ్చారు. దానిలో ఇరు కుటుంబాలు రాత్రి మొత్తం డ్యాన్స్‌లతో గడిపేశాయి. ఆకాశ్‌ నానమ్మ కోకిలాబెన్‌, అనిల్ అంబానీ సతీమణి టీనా అంబానీ ఈ వేడుకకు హాజరయ్యారు. బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ సెంటర్‌లో ఆకాశ్ జంట ఒక్కటికానున్నట్లు తెలుస్తోంది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu