నాకు అటువంటి సీన్‌లో నటించడం కంఫర్ట్‌గా అనిపించదు.. డైరెక్టర్‌కు డైరెక్ట్‌గా చెప్పేసిన సాయిపల్లవి
ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన భామ సాయి పల్లవి. అందం అభినయంతో కుర్రకారును కట్టిపడేసిన ఈ చిన్నది మొదటినుంచి గ్లామర్ షోకు దూరంగా ఉంటూ వస్తుంది. సాయిపల్లవి రొమాన్స్ , లిప్ లాక్ వంటి సీన్స్ లో ఇప్పటివరకు చేయలేదు.

ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన భామ సాయి పల్లవి. అందం అభినయంతో కుర్రకారును కట్టిపడేసిన ఈ చిన్నది మొదటినుంచి గ్లామర్ షోకు దూరంగా ఉంటూ వస్తుంది. సాయిపల్లవి రొమాన్స్ , లిప్ లాక్ వంటి సీన్స్ లో ఇప్పటివరకు చేయలేదు. ఇదే విషయం పై తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను ఓ సినిమాలో రొమాంటిక్ సీన్‌లో నటించే సమయంలో ఆ హీరో పెదవులపై ముద్దు పెట్టాలని దర్శకుడు చెప్పాడని ఆమె తెలిపింది. అయితే, తనకు అటువంటి సీన్‌లో నటించడం ఇష్టముండదని , తనకు కంఫర్ట్‌గా అనిపించదని దర్శకుడికి చెప్పేశానని తెలిపింది. కానీ ఆ సినిమా పేరు కానీ దర్శకుడి పేరు కానీ బయటపెట్టలేదు. తాను మీ టూ కారణంగా లిప్‌లాక్ సీన్ నుండి తప్పించుకున్నానని చెప్పుకొచ్చింది సాయిపల్లవి. ప్రస్తుతం సాయి పల్లవి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లవ్ స్టోరీ’లో నటిస్తుంది. అలాగే రానా హీరోగా నటిస్తున్న’విరాటపర్వం’ సినిమాలో చేస్తుంది. ఈ సినిమాతో పాటు నాని నటిస్తున్న’శ్యామ్ సింగరాయ్’ లోకూడా నటిస్తుంది. వీటితో పాటు శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న ‘మహాసముద్రం’లోకూడా సాయిపల్లవి నటిస్తుందని టాక్ నడుస్తుంది.