ఈ అరుదైన జాతి గొర్రెకు భారీ డిమాండ్‌.. రూ.70 ల‌క్ష‌లు పలికినా.. విక్ర‌యించ‌ని గొర్రె య‌జ‌మాని

సాధార‌ణంగా ఒక గొర్రె ధ‌ర రూ.5 నుంచి రూ.10 వేల వ‌ర‌కు ఉంటుంది. లేదంటే ఇంకొద్దిగా ధ‌ర ఎక్కువ‌గా ఉంటుంది. కానీ మాడ్గ‌ల్ జాతికి చెందిన గొర్రె ధ‌ర వింటే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. ఇది చాలా అరుదైన జాతి గొర్రె..

ఈ అరుదైన జాతి గొర్రెకు భారీ డిమాండ్‌.. రూ.70 ల‌క్ష‌లు పలికినా.. విక్ర‌యించ‌ని గొర్రె య‌జ‌మాని
Sheep
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 13, 2020 | 1:43 PM

సాధార‌ణంగా ఒక గొర్రె ధ‌ర రూ.5 నుంచి రూ.10 వేల వ‌ర‌కు ఉంటుంది. లేదంటే ఇంకొద్దిగా ధ‌ర ఎక్కువ‌గా ఉంటుంది. కానీ మాడ్గ‌ల్ జాతికి చెందిన గొర్రె ధ‌ర వింటే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. ఇది చాలా అరుదైన జాతి గొర్రె. దీని మాంసానికి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. తాజాగా మ‌హారాష్ట్ర‌లోని సాంగ్లీ జిల్లాలో ఓ వ్య‌క్తి ఈ అరుదైన జాతి గొర్రెను రూ. 70 ల‌క్ష‌లు పెట్టి కొనుగోలు చేసేందుకు ముందుకు వ‌చ్చాడు. కానీ ఆ గొర్రెను అమ్మేందుకు దాని య‌జ‌మాని అంగీక‌రించ‌లేదు. సాంగ్లీ జిల్లాలోని మాడ్గ‌ల్ గ్రామం ఈ జాతి గొర్రెల‌కు చాలా ప్ర‌సిద్ది. ఈ గొర్రె య‌జ‌మాని బాబు మెట్కారికి సాంగ్లీ జిల్లాలోని మాడ్గ‌ల్ గ్రామంలో సుమారు 200 వ‌ర‌కు గొర్రెలున్నాయి. అయితే ఈ మాడ్గ‌ల్ జాతి గొర్రెను రూ.70 ల‌క్ష‌లు పెట్టి కొనేందుకు ముందుకు రావ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగింద‌ని చెప్పుకొచ్చాడు. కానీ దానిని అమ్మ‌డం ఇష్టం లేద‌ని గొర్రె య‌జ‌మాని తెలిపాడు. ఆ గొర్రె అస‌లు పేరు షార్జా అని,  దానికి మోదీ అని నామ‌క‌ర‌ణం చేశామ‌ని తెలిపాడు.

అయితే మాడ్గ‌ల్ గొర్రె కూడా అన్ని మార్కెట్ల‌లో త‌న డిమాండ్‌ను పెంచుకుంటుంద‌ని ఆ పేరు పెట్టిన‌ట్లు చెప్పాడు. అంతేకాకుండా ఆ గొర్రె నా కుటుంబానికి ఎంతో అదృష్టం.. ఎట్టి ప‌రిస్థితుల్లో అమ్మ‌బోన‌ని స్ప‌ష్టం చేశాడు. కాగా, గొర్రెను కొనుగోలు చేసేందుకు రూ.70 ల‌క్ష‌ల‌కుపైగా ఆఫ‌ర్ చేశాడ‌ని, కానీ తాను రూ.కోటీ 50 ల‌క్ష‌ల‌కు మాత్ర‌మే అమ్ముతాన‌ని చెప్పుకొచ్చాడు. ఎందుకంటే ఓ గొర్రెను కొనుగోలు చేసేందుకు అంత ఖ‌ర్చు పెట్ట‌ర‌నే ఉద్దేశంతో అమాంతంగా ధ‌ర‌ను పెంచిన‌ట్లు గొర్రె య‌జ‌మాని పేర్కొన్నాడు. ఆ గొర్రెను అమ్మ‌డం ఇష్టం లేక‌నే అంత ధ‌ర‌ను పెంచిన‌ట్లు చెప్పాడు.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!