AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చివరి దశలో ఆర్కేకు సరైన ట్రీట్‌మెంట్ అందలేదా? అందకుండా చేశారా? దీని వెనుక ఎవరి వ్యూహమైనా ఉందా?

అలియాస్ అక్కిరాజు హరగోపాల్ అనారోగ్యంతో చనిపోయారు నో డౌట్. మావోయిస్టులు విడుదల చేసిన లేఖలోనూ ఇదే ఉంది. BUT.. ఎందుకు? చివరి దశలో ఆర్కేకు సరైన ట్రీట్‌మెంట్ అందలేదా? అందకుండా చేశారా?

చివరి దశలో ఆర్కేకు సరైన ట్రీట్‌మెంట్ అందలేదా? అందకుండా చేశారా? దీని వెనుక ఎవరి వ్యూహమైనా ఉందా?
Rk Alias Akkiraju Hara Gopa
Venkata Narayana
|

Updated on: Oct 15, 2021 | 7:47 PM

Share

RK: అలియాస్ అక్కిరాజు హరగోపాల్ అనారోగ్యంతో చనిపోయారు నో డౌట్. మావోయిస్టులు విడుదల చేసిన లేఖలోనూ ఇదే ఉంది. BUT.. ఎందుకు? చివరి దశలో ఆర్కేకు సరైన ట్రీట్‌మెంట్ అందలేదా? అందకుండా చేశారా? అగ్రనేతను ఎందుకు కాపాడుకోలేకపోయారు? దీని వెనుక పోలీసుల వ్యూహం ఉందా? YES.. అవుననే అంటున్నారు. అదే ఆపరేషన్ సమాధాన్‌..! అష్టదిగ్బంధనం. అడవుల అష్టదిగ్బంధనం. లోపలివాళ్లు బయటకు వెళ్లలేరు. బయటి వాళ్లు లోపలికి రాలేరు. YES. పోలీసులు వ్యూహాం మార్చారు. ప్లాన్‌-B అమలు చేస్తున్నారు. ఆర్కే విషయంలోనూ ఇదే స్కెచ్‌ వర్కౌట్ అయింది. పరిస్థితులు మారాయి. పద్ధతి కూడా మారింది. అడవే మావోయిస్టులకు బలం. అదే బలాన్ని ఇప్పుడు బలహీనతగా మార్చేశారు. అవును.కూంబింగ్‌లు చేపట్టడం…మావోలను వెతుక్కుంటూ వెళ్లి అటాక్‌లు చేయడం.. ఎన్‌కౌంటర్లు..ఇదంతా కాలం చెల్లిన పద్ధతి. మావోయిస్టులను ఏకాకులను చేయడం..వాళ్లని దండకారణ్యం నుంచి బయటకు రాకుండా చేయడం..బయటి నుంచి ఎలాంటి సహాయసహకారాలు అందకుండా చేయడం ఇది కొద్ద పద్ధతి. పోలీసులు అమలు చేస్తున్న ప్లాన్‌-బి ఇదే. అంటే అన్నలు అడవుల్లోనే అంతమయ్యే పరిస్థితి కల్పిస్తున్నారు. సృష్టిస్తున్నారు.

ఆపరేషన్ సమాధాన్‌..! మావోయిస్టులను ఎదుర్కొనేందుకు కేంద్రం అమలు చేస్తున్న పక్కాస్కెచ్ ఇది. ఇదే ఆపరేషన్‌ సమాధాన్‌తోనే ఆర్కే మరణాన్ని చూశారు చత్తీస్‌ఘడ్‌ పోలీసులు. పక్కా సమాచారంతో వ్యూహాన్ని అమలు చేశారు. ఆ తర్వాత మరణాన్ని నిర్థారించుకుని దాన్నో విజయంగా మీడియాకు చెప్పారు చత్తీస్‌ఘడ్ అధికారులు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో ఉన్న ఆర్కే పరిస్థితి ఈ మధ్యకాలంలో మరింత విషమించింది. దానిపై చత్తీస్‌గడ్ పోలీసులకు పక్కా సమాచారం ఉంది. కరోనా టైమ్‌కు ముందు నుంచీ అమలు చేస్తున్న ఆపరేషన్ సమాధాన్‌ను ఆర్కే విషయంలోనూ పక్కాగా పాటించారు. వెతుక్కుంటూ మావోయిస్టుల కోసమో, ఆర్కే కోసమో వెళ్లే కంటే.. బస్తర్‌, బీజాపూర్ అడవుల్లోకి వెళ్లే దారులను మూసేయడం మంచిదనుకున్నారు. బయటి వాళ్లను లోపలికి, లోపలివాళ్లను బయటకు రానివ్వకుండా అమలు చేస్తున్న ఆపరేషన్ సమాధాన్‌ను అప్లై చేశారు. వాళ్లు అనుకున్న ఫలితమే వచ్చింది. ట్రీట్‌మెంట్ అందక ఆర్కే చనిపోయాడు. ఇన్‌ఫార్మర్లతో పక్కా సమాచారం తెలుసుకుని, ధృవీకరించుకున్న తర్వాతే చత్తీస్‌గడ్ పోలీసులు ఆర్కే మరణాన్ని చెప్పారు. బహుశా.. మావోయిస్టులు ఆలస్యంగా నిర్దారించడం వెనుక కారణం కూడా ఆపరేషన్ సమాధానే కావచ్చు.

నక్సల్స్‌ ఫ్రీ జోన్‌గా దండకారణ్యం. కేంద్రం టార్గెట్ ఇదే. 2022 నాటికి పూర్తిగా ఏరివేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ ప్లాన్‌ అముల్లో భాగమే కొన్ని రోజులుగా అడవుల్లో సరికొత్త వ్యూహాలు. మావోయిస్టుల ఏరివేతకు టెక్నాలజీని జోడించారు. శాటిలైట్ సాయం తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు కదలికల్ని గమనిస్తున్నారు. అటు ఇన్ఫార్మర్‌ వ్యవస్థను మరింత పటిష్టం చేశారు. కొత్తగా రిక్రూట్‌మెంట్లు జరగకుండా చేస్తున్నారు.

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో శరవేగంగాఅభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. కేవలం రోడ్ల కోసమే 2 వేల 800 కోట్లు కేటాయించింది కేంద్రం. అభివృద్ధికార్యక్రమాలకు మరో4 వేల 600 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ పనులను కేంద్రం హై ప్రయారిటీగా భావిస్తోంది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి రెండు నెలలకోసారి డీజీపీలు, CSలతో సమీక్ష నిర్వహించడమే కాదు..వేగంగా పనులు కావాలని నిర్దేశిస్తున్నారు. ఇటీవలే కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్‌షా కూడా మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో కీలక సమావేశం నిర్వహించారు. మావోల ఏరివేతకు తీసుకుంటున్న… తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. SO..! మావోల ఏరివేతపై కేంద్రం సీరియస్‌గా ఫోకస్ చేస్తోంది. రాష్ట్రాలకు అదే చెబుతోంది. ఆపరేషన్ సమాధాన్‌, ఎన్‌కౌంటర్లు అందులోభాగమే.

Read also: దసరా అంబరాలకు మారుపేరు మైసూర్‌ ప్యాలెస్. మహారాజు వడియార్ జంబూ సవారీ కోసం కలర్‌ఫుల్‌గా ముస్తాబు