AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘టెన్త్ క్లాస్ డైరీస్’తో దర్శకుడిగా పరిచయమవుతున్న ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ‘గరుడవేగ’ అంజి

ది అంగ్రేజ్ ‘, ‘సీతా రాముడు' చిత్రాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి అంజి సినిమాటోగ్రాఫ‌ర్‌గా పరిచయమయ్యారు. తొలి సినిమాలతోనే మంచి పేరు తెచ్చుకున్నారు.

'టెన్త్ క్లాస్ డైరీస్'తో దర్శకుడిగా పరిచయమవుతున్న ప్రముఖ సినిమాటోగ్రాఫర్ 'గరుడవేగ' అంజి
10th Class Diaries
Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: Ram Naramaneni|

Updated on: Oct 15, 2021 | 7:21 PM

Share

‘ది అంగ్రేజ్ ‘, ‘సీతా రాముడు’ చిత్రాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి అంజి సినిమాటోగ్రాఫ‌ర్‌గా పరిచయమయ్యారు. తొలి సినిమాలతోనే మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత దర్శకరత్న దాసరి నారాయణరావు, రామ్ గోపాల్ వర్మ, శ్రీనివాసరెడ్డి తదితరుల చిత్రాలకు పని చేశారు. తమిళ, మలయాళ, హిందీ సినిమాలూ చేశారు. ‘గరుడవేగ’ సినిమా తర్వాత అదే ఆయన ఇంటి పేరు అయ్యింది. ఇప్పుడు సినిమాటోగ్రాఫ‌ర్‌గా హాఫ్ సెంచరీ కొట్టబోతున్నారు. సినిమాటోగ్రాఫ‌ర్‌గా తన 50వ సినిమాకు ‘గరుడవేగ’ అంజి దర్శకత్వం వహించడం విశేషం. అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్స్ పతాకాలపై అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘టెన్త్ క్లాస్ డైరీస్’. శ్రీనివాసరెడ్డి, ‘వెన్నెల’ రామారావు, అర్చన (వేద), హిమజ, శివబాలాజీ, మధుమిత, భాను శ్రీ, నాజర్, శివాజీరాజా తదితరులు ఇతర ప్రధాన తారాగణం. ఈ సినిమాతో ‘గరుడవేగ’ అంజి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. చిత్రీకరణ పూర్తయింది. విజయదశమి సందర్భంగా ఈ రోజు సినిమా టైటిల్, ఇతర వివరాలు వెల్లడించారు

‘గరుడవేగ’ అంజి మాట్లాడుతూ “సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ తమ టెన్త్ క్లాస్ రోజులు గుర్తొస్తాయి. బ్రహ్మాండమైన కథ కుదిరింది. రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని తీసిన సినిమా. రెగ్యులర్‌గా ఉండదు. మా నిర్మాతలు నేను ఏది అడిగినా కాదనలేదు. హీరో హీరోయిన్లు సహా నటీనటులు సహకారంతో సినిమా అద్భుతంగా వచ్చింది. సుమారు 40 మంది ఆర్టిస్టులు చేశారు. ఫెంటాస్టిక్ టెక్నికల్ టీమ్ కుదిరింది” అని అన్నారు.

నిర్మాతలు అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం మాట్లాడుతూ “అవికా గోర్ అంటే తెలుగు ప్రేక్షకులకు ‘ఉయ్యాలా జంపాలా’ గుర్తొస్తుంది. కానీ, ఈ సినిమా తర్వాత ‘టెన్త్ క్లాస్ డైరీస్’ గుర్తుకు వస్తుంది. ఛాలెంజింగ్ రోల్‌లో ఎక్సట్రాడినరీ పెర్ఫార్మన్స్ కనబరిచారు. శ్రీరామ్ కీలక పాత్రలో నటించారు. హైదరాబాద్, చిక్ మంగళూరు, రాజమండ్రి, అమెరికాలో చిత్రీకరణ చేశాం. ఆల్రెడీ టైటిల్‌కు సూపర్ రెస్పాన్స్ రావడం సంతోషంగా ఉంది. త్వరలో ఇతర వివరాలు వెల్లడిస్తాం” అని అన్నారు.

‘టెన్త్ క్లాస్ డైరీస్’ తారాగణం: శ్రీరామ్, అవికా గోర్, శ్రీనివాసరెడ్డి, ‘వెన్నెల’ రామారావు, అర్చన (వేద), హిమజ, శివ బాలాజీ, మధుమిత, భాను శ్రీ, నాజర్, శివాజీ రాజా, రాజశ్రీ నాయర్ , సత్యకృష్ణ, రూపలక్ష్మి, ‘తాగుబోతు’ రమేష్, ‘చిత్రం’ శ్రీను, గీతా సింగ్, రోహిణి (జబర్దస్త్), ‘జెమినీ’ సురేష్, ‘ఓ మై గాడ్’ నిత్య, రాహుల్, ‘కంచెరపాలెం’ కేశవ, ప్రేమ్, భవ్య, కావేరి , అంబటి శ్రీను, జీవన్ (జబర్దస్త్), భాష, కేఏ పాల్ రాము, గణపతి (జబర్దస్త్), రాకేష్ (జబర్దస్త్), కమల్, మహేష్ మచిడి

సాంకేతిక నిపుణుల వివరాలు: కథ : ‘వెన్నెల’ రామారావు, స్క్రీన్ ప్లే – డైలాగ్స్: శ్రుతిక్, లిరిక్స్: చైతన్య ప్రసాద్, కాసర్ల శ్యామ్, సురేష్ గంగుల, కొరియోగ్రఫీ: శేఖర్ వీజే, విజయ్ బిన్నీ, సన్నీ, ఫైట్స్: స్టంట్స్ జాషువా, పబ్లిసిటీ డిజైనర్: అనంత్, ప్రొడక్షన్ కంట్రోలర్: నరేన్ జి సూర్య, మేకప్: నారాయణ, కాస్ట్యూమ్స్: శ్రీదేవి కొల్లి, కో-డైరెక్టర్: విజయ్ కామిశెట్టి, ఆర్ట్ డైరెక్టర్: కృష్ణ, ఎడిటర్: ప్రవీణ్ పూడి, మ్యూజిక్ డైరెక్టర్: సురేష్ బొబ్బిలి, కో-ప్రొడ్యూసర్: రవి కొల్లిపర, నిర్మాతలు: అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం, సినిమాటోగ్రఫీ & దర్శకత్వం : ‘గరుడవేగ’ అంజి.

Also Read: Ram Charan-Prashanth Neel: ఇది కదా మెగా అభిమానులకు అసలైన పండుగ