Bollywood Drugs Case: డైలీ సీరియల్‌లా సాగుతున్న బాలీవుడ్ డ్రగ్స్ కేసు.. దియా మీర్జా మాజీ మేనేజర్‌కు షాక్ ఇచ్చిన కోర్టు

బాలీవుడ్‌ డ్రగ్స్‌ కలకలం డైలీ సిరియల్ ఎపిసోడ్లలా సాగుతూనే ఉంది. గంజాయిని అక్రమంగా దిగుమతి చేసుకున్న కేసులో దియా మీర్జా మాజీ మేనేజర్‌ రహీలా ఫర్నీచర్‌వాలా, అతని సోదరి సాహిస్తా, వ్యాపారవేత్త కరణ్ సజ్నాని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో జనవరి 9 న అరెస్టు చేశారు.

  • Surya Kala
  • Publish Date - 6:04 pm, Sun, 17 January 21
Bollywood Drugs Case: డైలీ సీరియల్‌లా సాగుతున్న బాలీవుడ్ డ్రగ్స్ కేసు.. దియా మీర్జా మాజీ మేనేజర్‌కు షాక్ ఇచ్చిన కోర్టు

Bollywood Drugs Case:గంజాయిని అక్రమంగా దిగుమతి చేసుకున్న కేసులో దియా మీర్జా మాజీ మేనేజర్‌ రహీలా ఫర్నీచర్‌వాలా, అతని సోదరి సాహిస్తా, వ్యాపారవేత్త కరణ్ సజ్నాని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో జనవరి 9 న అరెస్టు చేశారు. ముంబై కోర్టులో వారిని హాజరుపరిచారు. బాలీవుడ్ డ్రగ్ కేసుని విచారించిన ముంబై కోర్టు నటి దియా మీర్జా మాజీ మేనేజర్ రహిలా వ్యాపారవేత్త కరణ్ సజ్నానిలకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీని విధించింది. బాలీవుడ్‌ డ్రగ్స్‌ కలకలం డైలీ సిరియల్ ఎపిసోడ్లలా సాగుతూనే ఉంది. జనవరి 9 న పెద్ద ఎత్తున మత్తుమందుల్ని ఎన్‌సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్రిటన్‌ పౌరుడి నుంచి 200 కిలోల గంజాయిని ఎన్‌సీబీ పట్టుకున్నారు.

గంజాయి అక్రమ రవాణా జరుగుతోందనే పక్కా సమాచారంతో బాంద్రాలోని ఆపరేషన్‌ నిర్వహించి పట్టుకున్నామని వాంఖడే తెలిపారు . ఖార్ (వెస్ట్) లోని జస్వంత్ హైట్స్ లో దాడులు నిర్వహించి కరణ్‌ సజ్నానీ నుంచి ఇంపోర్టెడ్‌ గంజాయిని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. విచారణలో కరణ్ ఇచ్చిన సమాచారంతో రహీలా, సాహిస్తాను అదుపులోకి తీసుకొని, గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ఎన్‌సిబి జోనల్ డైరెక్టర్ చెప్పారు. గంజాయిని పేకెట్స్ ను ముంబై తో పాటు ఇతర రాష్ట్రాల్లోని ఖాతాదారులకు విక్రయిస్తూ స్మగ్లింగ్ కార్యకలాపాలకు పాల్పడ్డారని చెప్పారు. గత ఏడాది నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించిన తరువాత, బాలీవుడ్ పరిశ్రమలో డ్రగ్స్ వాడకంపై పోలీసులు విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే.

Also Read: మన దేశం పోలియో రహిత దేశంగా మారినట్లే.. త్వరలో కరోనా రహిత దేశంగా మారుతుంది: బిగ్ బీ