చైనాలోని తొలి కోవిడ్ పేషంట్ ఆచూకీ దొరికింది, వూహాన్ ల్యాబ్ రీసెర్చర్ గా అమెరికా విదేశాంగ శాఖ ధ్రువీకరణ

చైనాలో గత ఏడాది ఫిబ్రవరిలో కోవిడ్ బారిన పడిన తొలి రోగి ఆచూకీ లభించింది. హువాంగ్ యాన్ లింగ్ అనే ఈ మహిళ వూహాన్ ల్యాబ్ లో గబ్బిలాలపై..

  • Umakanth Rao
  • Publish Date - 6:01 pm, Sun, 17 January 21
చైనాలోని తొలి కోవిడ్ పేషంట్ ఆచూకీ దొరికింది, వూహాన్ ల్యాబ్ రీసెర్చర్ గా అమెరికా విదేశాంగ శాఖ ధ్రువీకరణ

చైనాలో గత ఏడాది ఫిబ్రవరిలో కోవిడ్ బారిన పడిన తొలి రోగి ఆచూకీ లభించింది. హువాంగ్ యాన్ లింగ్ అనే ఈ మహిళ వూహాన్ ల్యాబ్ లో గబ్బిలాలపై పరిశోధనలు చేస్తూ కరోనా వైరస్ కి గురైన వారిలో మొదటి వ్యక్తి అట.. ఈమె కోసం అమెరికా విదేశాంగ శాఖ సిబ్బంది ఏడాది కాలంగా అనేక చోట్ల గాలిస్తూ వచ్చారని తెలిసింది. వూహన్ వైరాలజీ ఇన్స్ టి ట్యూట్ లో పని చేసిన ఈమె అప్పటికి 20 ఏళ్ళ వయస్సులో ఉందట. ప్రపంచంలోనే ఈమె మొదటి కోవిడ్ పేషంట్ అని అమెరికా అంటున్నప్పటికీ చైనా ప్రభుత్వం, వూహన్ ల్యాబ్ ఈ వాదనలను కొట్టిపారేశాయి. అసలు ఈ మహిళ హువాంగ్ పోలికలతో ఉన్న వ్యక్తి అని, అసలు మహిళ సురక్షితంగా, చైనాలోనే ఎక్కడో ఉందని ఇవి పేర్కొన్నాయి. ఇంటర్నెట్ లో హువాంగ్ ఫోటోలను, ఆమె వివరాలను ఇవి మాయం చేసేశాయి. 2015 లో హువాంగ్ తన ల్యాబ్ నుంచి బయటికి వచ్ఛేసి ఆ తరువాత కనిపించలేదు. బహుశా హాంకాంగ్ లో ఈమె తలదాచుకుని ఉండవచ్చు అని భావించారు. ఏమైనా ఈమె ప్రస్తుతం అక్కడే ఉందని అమెరికా ముమ్మాటికీ భావిస్తోంది.

Also Read:

Cooked Chicken : నాన్ వెజ్ ప్రియులకు శుభవార్త.. ఇలా చేసి తినమంటు సూచనలు చేసిన కేంద్రం

Ayodhya Ram Mandir: ఆయోధ్య రామాలయానికి భారీగా వస్తోన్న విరాళాలు.. ఇప్పటి వరకు వచ్చిన విరాళాల మొత్తం ఎంతంటే..?

A Proud Moment of India: మన దేశం పోలియో రహిత దేశంగా మారినట్లే.. త్వరలో కరోనా రహిత దేశంగా మారుతుంది: బిగ్ బీ