Baba ka Dhaba owner: కరోనా టైం లో ఓవర్ నైట్ లో ఫేమస్ అయిన తాత.. బాబా కా దాబా ఓనర్ కాంత ప్రసాద్ ఆత్మహత్యాయత్నం..!

కరోనా టైమ్‌లో ఓవర్‌ నైట్‌లో ఫేమస్ అయిపోయిన కాంత ప్రసాద్‌ ఇప్పుడు ఆత్మహత్యాయత్నం చేశారు. అయన్ను కుటుంబసభ్యులు సప్దార్ జంగ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Baba ka Dhaba owner: కరోనా టైం లో ఓవర్ నైట్ లో ఫేమస్ అయిన తాత.. బాబా కా దాబా ఓనర్ కాంత ప్రసాద్ ఆత్మహత్యాయత్నం..!
Delhi Baba Ka Dhaba Owner Kanta Prasad
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 18, 2021 | 4:04 PM

Baba ka Dhaba owner Kanta Prasad suicide attempts: సోషల్‌ మీడియా సానుభూతి ఆ తాత పాలిట శాపంగా మారాయా? ఏమో.. గత కరోనా టైమ్‌లో ఓవర్‌ నైట్‌లో ఫేమస్ అయిపోయిన కాంత ప్రసాద్‌ ఇప్పుడు ఆత్మహత్యాయత్నం చేశారు. ఇంతకీ ఆయనకు అంత పెద్ద ఆపద ఎందుకు వచ్చింది. ఒక్కసారి చూద్దాం…

దక్షిణ ఢిల్లీలోని మాలవ్యానగర్‌లో రోడ్డు పక్కన చిన్న హోటల్‌ నడుపుకుంటున్నారు బాబా కా దాబా దంపతులు. చాలీచాలని ఆదాయంతో బతుకీడుస్తున్నారు. ఆ వృద్ధ దంపతులు. కరోనా వల్ల ఆదాయం లేక కన్నీటి పర్యంతం అవుతున్న బాబా కా దాబా దంపతుల వ్యథను యూ ట్యూబర్‌ గౌరవ్‌ వాసన్ గత ఏడాది సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. ఈ వీడియో దేశవ్యాప్తంగా వైరల్‌గా మారింది. బాబాకా దాబాకు జనం పోటెత్తారు. దీంతో రాత్రికి రాత్రే సక్సెస్‌ఫుల్‌ దాబాగా మారింది.

మానవతావాదులు అందించిన ఆర్థిక సాయంతో కాంతాప్రసాద్‌ దంపతులు తమ అప్పులన్నీ తీర్చేశారు. అంతేకాదు రూ.5 లక్షల దాకా పోగుచేశారు. ఈ డబ్బుతో అద్దె స్థలంలో రెస్టారెంట్‌ ప్రారంభించారు. ఆరు నెలలపాటు సక్రమంగా నడిచి ఫిబ్రవరిలో మూతపడింది. రూ.5 లక్షల పెట్టుబడితో వారు గతేడాది ప్రారంభించిన రెస్టారెంట్‌ ఆరు నెలలు బాగానే నడిచింది. క్రమంగా జనాల రాక పడిపోయింది. నష్టాలు వస్తుండడంతో చేసేది లేక ఈ ఏడాది ఫిబ్రవరిలో మూసేశారు. ఇప్పుడు మళ్లీ పాత హోటలే కొనసాగిస్తున్నారు.

లాక్‌డౌన్‌ కంటే ముందు నిత్యం రూ.3,500 దాకా అమ్మకాలు జరిగేవి. ఇప్పుడు కనీసం రూ.1,000 కూడా రావడం లేదని కాంతాప్రసాద్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. తమ కుటుంబంలో 8 మంది ఉన్నామని, ఈ ఆదాయంతో ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. రెస్టారెంట్‌ ప్రారంభిస్తే నష్టాలే మిగిలాయన్నాడు. ముగ్గురిని పనిలో పెట్టుకున్నానని, నెలవారీ ఆదాయం ఎప్పుడూ రూ.40 వేలు దాటలేదన్నాడు. కొందరి తప్పుడు సలహా వల్లే రెస్టారెంట్‌ మొదలుపెట్టానని అవేదన వ్యక్తం చేశాడు కాంతాప్రసాద్. ఇప్పుడు అప్పులు పాలు కావడంతో ఆందోళన చెందిన కాంతా ప్రసాద్ ఆత్మహత్యయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను సప్దార్ జంగ్ ఆసుపత్రికి తరలించారు. కాగా, ఘటనకు సంబంధించి ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Baba Ka Dhaba Owner Kanta Prasad

Baba Ka Dhaba Owner Kanta Prasad

Read Also…  PM Modi Crash Course: రూపు మార్చుకుంటున్న వేరియంట్స్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమవ్వాలి.. కస్టమైజ్డ్​క్రాష్‌ కోర్సు ప్రారంభించిన ప్రధాని

బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!