ఢిల్లీపై చలి పంజా..గజగజలాడుతోన్న ప్రజలు

ఢిల్లీని ఒకవైపు కాలుష్యం, మరోవైపు చలి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గత 120 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ లేనంత చలి..ఢిల్లీపై పంజా విసిరింది. గత 14 రోజులుగా దేశ రాజధాని చలితో వణికిపోతోంది. ఈ పక్షం రోజుల్లో అక్కడ నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 19.4 డిగ్రీల సెల్సియస్. డిసెంబర్ 31 నాటికి ఇది 19.15 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతుందని భారత వాతావరణ శాఖ అధికారి తెలిపారు. డిసెంబర్ సగటు ఉష్ణోగ్రత 1919, 1929, 1961, 1997 లలో మాత్రమే […]

ఢిల్లీపై చలి పంజా..గజగజలాడుతోన్న ప్రజలు
Follow us

|

Updated on: Dec 28, 2019 | 10:25 AM

ఢిల్లీని ఒకవైపు కాలుష్యం, మరోవైపు చలి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గత 120 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ లేనంత చలి..ఢిల్లీపై పంజా విసిరింది. గత 14 రోజులుగా దేశ రాజధాని చలితో వణికిపోతోంది. ఈ పక్షం రోజుల్లో అక్కడ నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 19.4 డిగ్రీల సెల్సియస్. డిసెంబర్ 31 నాటికి ఇది 19.15 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతుందని భారత వాతావరణ శాఖ అధికారి తెలిపారు.

డిసెంబర్ సగటు ఉష్ణోగ్రత 1919, 1929, 1961, 1997 లలో మాత్రమే 20 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉందని అధికారుల లెక్కలు చెప్తున్నాయి. డిసెంబర్ 1997 అత్యల్ప సగటు గరిష్ట ఉష్ణోగ్రత 17.3 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.  ఈ ఏడాది ఇప్పటివరకు నమోదైన 19.4 డిగ్రీల సెల్సియస్ కంటే తగ్గితే..  ప్రస్తుత నెల 1901 నుండి రెండవ అతి చలితో కూడిన డిసెంబర్ అవుతుంది. ఇక దట్టమైన పొగమంచు, కోల్డ్ వేవ్ రాబోయే రెండు రోజులలో కూడా కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. కాగా శనివారం  ఉదయం కనిష్ట ఉష్ణోగ్రత 2.4 డిగ్రీలని నమోదు అయ్యింది.  ఈ సీజన్‌లో ఇదే ఇప్పటివరకు అత్యల్పం. ఐఎండీ లెక్కల ప్రకారం, గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే కనీసం 4.5 నోట్లు ఉన్నప్పుడు “చల్లని రోజు”. గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే కనీసం 6.5 డిగ్రీల సెల్సియస్ ఉన్నప్పుడు “తీవ్రమైన చల్లని రోజు”.

గాలి దిశలో మార్పు డిసెంబర్ 30 నుంచి వచ్చే అవకాశం ఉంది. ఇది కొంతమేర చలి నుంచి ఉపశమనం కలిగించవచ్చు. చలితో ఢిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 10, 11 సమయం వరకు మంచు తెర వీడటం లేదు. మంచు వల్ల యాక్సిడెంట్స్‌ జరుగుతున్నాయి. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు, రైళ్ల సర్వీసులకు అంతరాయం కలుగుతోంది. 

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!