బ్రేకింగ్: భారీ మెజార్టీ.. కేజ్రీవాల్‌దే మళ్ళీ ఢిల్లీ పీఠం…
Delhi Election Results 2020: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ జోరు కొనసాగుతోంది. 59 స్థానాల్లో ఆధిక్యంతో అధికార పార్టీ ఆప్ కొనసాగుతుండగా.. బీజేపీ 11 స్థానాలు మాత్రమే దక్కించుకోగలిగింది. అటు న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ 13,508 ఓట్ల మెజార్టీతో అద్భుత విజయం సాధించారు. దాదాపు మూడోసారి కూడా ఢిల్లీ అధికార పీఠాన్ని ఆప్ అధినేత దక్కించుకోనున్నట్లు స్పష్టమైంది. ప్రభుత్వం ఏర్పాటుకు స్పష్టమైన మెజార్టీని ఆప్ సాధించింది. ఇప్పటికే అరవింద్ […]
Delhi Election Results 2020: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ జోరు కొనసాగుతోంది. 59 స్థానాల్లో ఆధిక్యంతో అధికార పార్టీ ఆప్ కొనసాగుతుండగా.. బీజేపీ 11 స్థానాలు మాత్రమే దక్కించుకోగలిగింది. అటు న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ 13,508 ఓట్ల మెజార్టీతో అద్భుత విజయం సాధించారు.
దాదాపు మూడోసారి కూడా ఢిల్లీ అధికార పీఠాన్ని ఆప్ అధినేత దక్కించుకోనున్నట్లు స్పష్టమైంది. ప్రభుత్వం ఏర్పాటుకు స్పష్టమైన మెజార్టీని ఆప్ సాధించింది. ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్‌కు కాంగ్రెస్ అభినందనలు తెలిపగా.. ఓక్లాలో ఆప్ అభ్యర్థి అమన్‌తుల్లాఖాన్ 72 వేల ఓట్ల ఆధిక్యంలో ముందంజలో ఉన్నారు. అటు ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత విడుదలైన పలు ఎగ్జిట్ పోల్స్ ఆప్‌దే మళ్ళీ అధికారం అని ఓటు వేయగా.. సరిగ్గా దాన్ని నిజం చేస్తూ హస్తిన ఓటర్లు అరవింద్ కేజ్రీవాల్‌కే పట్టం పట్టారు.