విద్యార్థులకు గుడ్ న్యూస్… జూన్ 20 నుంచి డిగ్రీ పరీక్షలు..!

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ కట్టడికోసం ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ లో ఉండిపోయాయి. దీంతో అన్ని పరీక్షలు వాయిదా పడిన సంగతి విదితమే. అయితే తాజాగా డిగ్రీ పరీక్షలను నిర్వహించేందుకు అధికార

విద్యార్థులకు గుడ్ న్యూస్... జూన్ 20 నుంచి డిగ్రీ పరీక్షలు..!
Follow us

| Edited By:

Updated on: May 13, 2020 | 11:04 AM

Degree Annual exams: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ కట్టడికోసం ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ లో ఉండిపోయాయి. దీంతో అన్ని పరీక్షలు వాయిదా పడిన సంగతి విదితమే. అయితే తాజాగా డిగ్రీ పరీక్షలను నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. వాస్తవానికి కరోనా నేపథ్యంలో తృతీయ సంవత్సరం డిగ్రీ పరీక్షలను ముందుగా నిర్వహించాలని అధికారులు భావించారు. కానీ పలు ఇబ్బందులు ఎదురవుతుండడంతో అన్ని పరీక్షలను ఒకేసారి నిర్వహించాలని నిర్ణయించారు.

కాగా.. దీనికి సంబంధించి రెండు మూడు రోజుల్లో అన్ని వర్సిటీలకు తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆదేశాలు ఇవ్వనుంది. జూన్ 20 నుంచి పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో విద్యార్థులు వ్యక్తిగత దూరం పాటించేలా చూడనున్నారు. పీజీ ప్రవేశాలకు డిగ్రీ ఫలితాలకు సంబంధం ఉన్న నేపథ్యంలో తొలుత తృతీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని రాష్ట్రంలోని యూనివర్సిటీలు భావించాయి.

కానీ.. కేవలం ఫైనలియర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తే.. వారిలో గత రెండు సంవత్సరాల్లో ఫెయిలైన సబ్జెక్టులు ఉన్న విద్యార్థులకు ఇబ్బందులు తప్పవు. కరోనా వైరస్ నేపథ్యంలో విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రశ్నపత్రంలోనూ మార్పులు చేసేందుకు నిర్ణయించారు. ప్రశ్నలను తగ్గించి.. ఎక్కువ ఆప్షన్లు ఇవ్వనున్నారు. ఒక్కో ప్రశ్నకు గతంలో కన్నా ఎక్కువ మార్కులు కేటాయించనున్నారు.