లాక్‌డౌన్ వేళ.. హిజ్రా దారుణ హత్య.. రీజన్ ఇదేనా..?

ఓ వైపు దేశ వ్యాప్తంగా కరోనా కట్టడిలో భాగంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొన్నింటిపై సడలింపులనిచ్చింది. దీంతో రోడ్లపైకి వాహనాలు పెరిగాయి. అంతేకాదు మద్యం షాపులు తెరవడంతో.. ఇన్నాళ్లు ఆగిన క్రైం రేటు మళ్లీ పెరుగుతోంది. తాజాగా వరంగల్ అర్బన్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నగరంలోని కాకతీయ యూనివర్సిటీ సమీపంలో ఓ హిజ్రా దారుణ హత్యకు గురైంది. అయితే ఈ హిజ్రా మర్డర్ వెనుక సురేష్ అనే […]

  • Tv9 Telugu
  • Publish Date - 10:41 am, Wed, 13 May 20
లాక్‌డౌన్ వేళ.. హిజ్రా దారుణ హత్య.. రీజన్ ఇదేనా..?

ఓ వైపు దేశ వ్యాప్తంగా కరోనా కట్టడిలో భాగంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొన్నింటిపై సడలింపులనిచ్చింది. దీంతో రోడ్లపైకి వాహనాలు పెరిగాయి. అంతేకాదు మద్యం షాపులు తెరవడంతో.. ఇన్నాళ్లు ఆగిన క్రైం రేటు మళ్లీ పెరుగుతోంది. తాజాగా వరంగల్ అర్బన్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నగరంలోని కాకతీయ యూనివర్సిటీ సమీపంలో ఓ హిజ్రా దారుణ హత్యకు గురైంది. అయితే ఈ హిజ్రా మర్డర్ వెనుక సురేష్ అనే ఓ కారు డ్రైవర్ హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హిజ్రా హరిణి గత కొద్ది రోజులుగా కారు డ్రైవర్ సురేష్‌ను వేధింపులకు గురిచేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ క్రమంలోనే సురేష్ హిజ్రా హరిణిని హతమార్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా, నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.