సంగారెడ్డి బయో డీజిల్ పరిశ్రమలో రియాక్ట‌ర్ పేలుడు..

సంగారెడ్డి జిల్లాలో భారీ ప్ర‌మాదం జ‌రిగింది. జిల్లాలోని ఓ ప‌రిశ్ర‌మ‌లో భారీ పేలుడు సంభ‌వించింది. పేలుడు దాటికి ఆ ప్రాంత‌మంతా భ‌య‌న‌కంగా మారింది.

సంగారెడ్డి బయో డీజిల్ పరిశ్రమలో రియాక్ట‌ర్ పేలుడు..
Follow us

|

Updated on: May 13, 2020 | 3:36 PM

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం  విశాఖ‌ప‌ట్నంలోని ఎల్జీపాలిమ‌ర్ ప‌రిశ్ర‌మ‌లో జ‌రిగిన ప్ర‌మాదం ఇంకా అంద‌రినీ వెంటాడుతోంది. ఆ రోజు అక్క‌డ క‌నిపించిన దృశ్యాలు అంద‌రినీ క‌ల‌చివేశాయి. ఇంకా ఆ విషాద సంఘ‌ట‌న మ‌రువ‌క ముందే తెలంగాణ‌లోని ఓ ప‌రిశ్ర‌మ‌లో భారీ ప్ర‌మాదం చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. జిల్లాలోని ఓ ప‌రిశ్ర‌మ‌లో భారీ పేలుడు సంభ‌వించింది. పేలుడు దాటికి ఆ ప్రాంత‌మంతా భ‌య‌న‌కంగా మారింది. మంట‌లు ఎగిసిప‌డుతున్నాయి. స్కంధ బయోడీజిల్ కర్మాగారంలో రియాక్టర్ పేల‌డంతో ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లుగా తెలుస్తోంది.వివ‌రాల్లోకి వెళితే…

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం అర్జున్ నాయక్ తండా వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. స్కంద బ‌యోడీజిల్ పరిశ్రమలోని రియాక్టర్ పేలడంతో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే చనిపోయారు. మరికొంత మంది ఉద్యోగులు గాయపడ్డారు. ఘటనపై సమాచారం అందుకున్న అగ్రిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్ష‌త‌గాత్రుల‌ను ఆస్పత్రికి తరలించారు. విశాఖలో స్టైరీన్ గ్యాస్ లీకేజ్ దుర్ఘటనను మరవకముందే.. సంగారెడ్డి జిల్లాలోని ఈ పరిశ్రమలో రియాక్టర్ పేలడం క‌ల‌క‌లం రేపుతోంది. వ‌రుస‌ ప్రమాదాల నేపథ్యంలో పరిశ్రమలో భద్రతా ప్రమాణాల విష‌యంలో డొల్ల‌త‌నం తెలుస్తోంద‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.