డ్రగ్స్ కేసు, రేపు ఎన్సీబీ ముందుకు దీపిక మేనేజర్ కరిష్మా ప్రకాష్ !

డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ టాలెంట్ మేనేజర్ కరిష్మా ప్రకాష్ బుధవారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎదుట హాజరు కానుంది. ఇటీవల తాము జారీ చేసిన సమన్లకు స్పందించకుండా ఆమె  ‘ఎక్కడో దాక్కోవడంతో’..అధికారులు వాటిని ఆమె తల్లికి అందజేశారు. గత నెల చివరివారంలో కరిష్మా ఇంటి నుంచి ఎన్సీబీ సిబ్బంది 1.7 గ్రాముల హాషిష్ ని, నిషిధ్ధ సీబీడీ ఆయిల్ ని, కెనబిస్ ప్రాడక్ట్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా ఈమెను […]

డ్రగ్స్ కేసు, రేపు ఎన్సీబీ ముందుకు దీపిక మేనేజర్ కరిష్మా ప్రకాష్ !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 03, 2020 | 4:22 PM

డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ టాలెంట్ మేనేజర్ కరిష్మా ప్రకాష్ బుధవారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎదుట హాజరు కానుంది. ఇటీవల తాము జారీ చేసిన సమన్లకు స్పందించకుండా ఆమె  ‘ఎక్కడో దాక్కోవడంతో’..అధికారులు వాటిని ఆమె తల్లికి అందజేశారు. గత నెల చివరివారంలో కరిష్మా ఇంటి నుంచి ఎన్సీబీ సిబ్బంది 1.7 గ్రాముల హాషిష్ ని, నిషిధ్ధ సీబీడీ ఆయిల్ ని, కెనబిస్ ప్రాడక్ట్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా ఈమెను ఎన్సీబీ విచారించింది. అయితే కరిష్మా యాంటిసిపేటరీ బెయిల్ కోసం అప్లై చేసుకుంది.