AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: పీఎం కిసాన్‌పై బిగ్‌ అప్‌డేట్.. 23వ విడత వచ్చేది అప్పుడే.. డబ్బులు పడాలంటే ఇలా చేయండి

పీఎం కిసాన్ 23వ విడత జూలైలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నిధులు పొందాలంటే లబ్ధిదారులు తమ మొబైల్ నంబర్‌ను తప్పనిసరిగా అప్‌డేట్ చేసుకోవాలి. మీ నెంబర్‌ అప్‌డేట్ చేయకపోతే 23వ విడత సాయం అందకపోవచ్చు. కాబట్టి ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్‌లోనే మొబైల్ నెంబర్ ఎలా అప్‌డేట్‌ చేసుకోవాలో చూద్దాం.

PM Kisan: పీఎం కిసాన్‌పై బిగ్‌ అప్‌డేట్.. 23వ విడత వచ్చేది అప్పుడే.. డబ్బులు పడాలంటే ఇలా చేయండి
Pm Kisan Samman Nidhi
Anand T
|

Updated on: Apr 25, 2026 | 11:11 AM

Share

దేశంలోని రైతన్నలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో పీఎం కిసాన్ పథకం కింద ఏడాదికి రూ.6వేల పెట్టుబడి సాయాన్ని అందిస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ పథకం కింద ప్రభుత్వం 22వ విడతల్లో రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసింది. గత నెల 13నే గౌహతిలో ప్రధాని మోదీ 22వ విడత విడుదల చేశారు. దీంతో ఇప్పుడు రైతులంతా 23వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాధారణంగా, ఈ పథకం కింద ప్రతి 4 నెలలకు ఒకసారి రైతుల ఖాతాల్లో విడుదలవుతాయి. 22వ విడత మార్చిలో వచ్చింది కాబట్టి, 23వ విడత జూలైలో వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం నుంచి వచ్చే పెట్టుబడి సాయం మీరు పొందాలంటే మీ మొబైల్ నంబర్ అప్‌డేట్‌గా ఉండటం చాలా ముఖ్యం. లేకపోతే మీ ఈ సారి డబ్బులు అంతనట్టే. కాబట్టి ఆన్‌లైన్‌లో మొబైల్ నెంబర్ ఎలా అప్‌డేట్ చేసుకోవాలో చూద్దాం..

ఆన్‌లైన్‌లో మొబైల్ నంబర్ అప్‌డేట్ చేసే విధానం

  • మీ మొబైల్ నంబర్ మీ ఆధార్ కార్డుతో లింక్ అయి ఉంటే, మీరు సులభంగా ఇ-కేవైసీ ద్వారా నంబర్ మార్చుకోవచ్చు
  • ముందుగా PM కిసాన్ అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in వెళ్లండి
  • హోమ్‌పేజీలో ఉన్న ‘Farmers Corner’ సెక్షన్‌లోకి వెళ్లి e-KYC ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
  • అక్కడ మీ 12 అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేసి సెర్చ్‌పై పై క్లిక్ చేయండి.
  • ఇప్పుడు మీరు అప్‌డేట్ చేయాలనుకుంటున్న కొత్త మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
  • గెట్‌ ఓటీపీ పై క్లిక్ చేస్తే, మీ మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
  • అంతే వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత మీ నంబర్ అప్‌డేట్ అవుతుంది.

ఇలా కూడా అప్‌డేట్ చేసుకోవచ్చు

CSC సెంటర్: ఒకవేళ మీకు ఆన్‌లైన్‌లో చేయడం వీలుకాకపోతే, మీ దగ్గర్లోని సీఎస్‌సీ సెంటర్‌కు వెళ్లి అక్కడ అప్‌డేట్‌ చేసుకోవచ్చు. అక్కడ బయోమెట్రిక్ ద్వారా మీ ఇ-కేవైసీ పూర్తి చేసి, కొత్త నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏవైనా సమస్యలు ఎదురైతే PM కిసాన్ హెల్ప్‌లైన్ నంబర్లు 155261 లేదా 1800115526 కు కాల్ చేయవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us