Dead Fish Alive: నిలువునా కోసేసినా మళ్లీ అతుక్కుంటూ .. బతికేస్తోన్న చేప.. వైరల్ అవుతోన్న వీడియో
నాన్ వెజ్ ప్రియులకు ముఖ్యంగా సి ఫుడ్ ప్రియులకు చేపలంటే చాలా చాలా ఇష్టం. ఈ చేపలతో రుచికరమైన వంటలను తయారు చేసుకుని లొట్టలేసుకుంటూ మరీ తింటారు.. ఇవి రుచికరమైనవే కాదు..
Dead Fish Alive: నాన్ వెజ్ ప్రియులకు ముఖ్యంగా సి ఫుడ్ ప్రియులకు చేపలంటే చాలా చాలా ఇష్టం. ఈ చేపలతో రుచికరమైన వంటలను తయారు చేసుకుని లొట్టలేసుకుంటూ మరీ తింటారు.. ఇవి రుచికరమైనవే కాదు.. అనేక పోషక విలువలను కలిగి ఉన్నవని.. ముఖ్యంగా విటమిన్ ఇ పుష్కలంగా లభిస్తుందన్న సంగతి తెలిసిందే.. ఇక ఇటీవల చేపలను ఆహారంగా తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. దీనికి ప్రధాన కారణం చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలే కారణమని పరిశోధకులు వెల్లడించారు.
అయితే ఈ చేపలు నీటి నుంచి బయటకు వచ్చిన కొన్ని వెంటనే చనిపోతే కొన్ని గంటల్లో మరణిస్తాయి.. అయితే ఇప్పుడు ఓ చేప తనను నిలువునా కట్ చేసినా మళ్ళీ దగ్గరకు వచ్చి అతుక్కుపోతుంది. ఇలా ఎన్ని సార్లు చేసినా చేప మళ్ళీ దగ్గరకు అతుక్కోవడం అందరికీ ఆశ్చర్యంగా మారింది.
ఈ చేపను నిలువగా కట్ చేసినప్పటికీ.. ఆ కట్ అయిన భాగాలు మళ్లీ దగ్గరకు అతుక్కుపోతున్నాయి. దాన్ని ఎన్నిసార్లు విడదీసినప్పటికీ మళ్లీ మళ్లీ అవి అతుక్కుపోయి ఆ చేప ప్రాణం పోసుకుంటోంది. ఈ వింత చేపకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. అయితే ఆ చేప బతకడం అనేది నిజంకాదని.. తాజాగా ఉండే చేపను నిలువునా కోసేస్తే.. కండరాల్లో కదలిక మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. దానివల్లే ఆ చేప మళ్లీ తిరిగి అతుక్కుపోతుంది. ఇది కండరాల సంకోచం. మెదడు ఇచ్చే ఆదేశాల ప్రకారమే ఆ కండరాలు కదులుతాయి. అందుకే.. ఈ చేప చనిపోయినప్పటికీ అలా ప్రవర్తిస్తోందని తెలుస్తోంది.
Also Read: