దావూద్‌కు మా దేశపు పాస్‌పోర్ట్‌ లేదు, అతడు మా దేశపు పౌరుడే కాదు!

మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినెల్‌ దావూద్‌ ఇబ్రహీం కామన్‌వెల్త్‌ ఆఫ్‌ డొమినికా కూడా దావూద్‌ తమ దగ్గర లేడని గట్టిగా చెబుతోంది.. దావూద్‌ ఇబ్రహీంకు తమ దేశ పౌరసత్వం ఉందని వస్తున్న వార్తలలో నిజం లేదని తెలిపింది. అతడికి తమ దేశపు పాస్‌పోర్ట్‌ కూడా లేదని అధికారిక ప్రకటన చేసింది.

దావూద్‌కు మా దేశపు పాస్‌పోర్ట్‌ లేదు, అతడు మా దేశపు పౌరుడే కాదు!
Balu

|

Aug 30, 2020 | 3:17 PM

మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినెల్‌ దావూద్‌ ఇబ్రహీం పాకిస్తాన్‌లోనే ఉన్నాడన్నది భారతీయుల గట్టి నమ్మకం. పాకిస్తాన్‌ మాత్రం అబ్బే దావూద్‌ మా దగ్గర లేడని గత 20 ఏళ్లుగా అరిగిపోయిన రికార్డును అలవోకగా వేసేస్తుంటుంది.. ఫలానా చోట ఉన్నాడని చెప్పడమే కానీ ఆ క్రిమినెల్‌ మాత్రం దొరకడం లేదు.. ఇప్పుడు కామన్‌వెల్త్‌ ఆఫ్‌ డొమినికా కూడా దావూద్‌ తమ దగ్గర లేడని గట్టిగా చెబుతోంది.. దావూద్‌ ఇబ్రహీంకు తమ దేశ పౌరసత్వం ఉందని వస్తున్న వార్తలలో నిజం లేదని తెలిపింది. అతడికి తమ దేశపు పాస్‌పోర్ట్‌ కూడా లేదని అధికారిక ప్రకటన చేసింది. ఎవరికి పడితే వారికి పౌరసత్వం ఇచ్చే దేశం తమది కాదని, పౌరసత్వం ఇచ్చేటప్పుడు నిజాయితీతో కూడిన నూతన విధానాలను అనుసరిస్తున్నామని డొమినికా స్పష్టం చేసింది.

దావూద్‌ అనే వ్యక్తి మామూలుడో కాదు.. పలు రకాల పేర్లతో పలు దేశాల పాస్‌పోర్టులు అతడికి ఉన్నాయని కథనాలు వచ్చాయి. భారత్‌తో పాటు పాకిస్తాన్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, కామన్‌వెల్త్‌ ఆఫ్‌ డొమినికా వంటి దేశాల అడ్రెస్‌లతో పాస్‌పోర్టులు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి.. మొన్నటికి మొన్న ఆ అండర్‌వరల్డ్‌ డాన్‌ తమ దగ్గరే ఉన్నాడంటూ చెప్పిన పాకిస్తాన్‌ కొన్ని గంటల్లోనే మాట మార్చేసింది. దావూద్‌ అనే వ్యక్తి మా దేశంలో లేడంటూ పాత పాటనే కొత్త ట్యూన్‌తో పాడింది.. 88 నిషేధిత ఉగ్ర సంస్థలు దాని అధినేతలపై పాకిస్తాన్‌ సర్కారు ఆంక్షలు విధించింది. ఆశ్చర్యమేమిటంటే ఈ లిస్టులో దావూద్‌ పేరు కూడా ఉండటం.. అతగాడికి కరాచీలోనే రెండు నివాసగృహాలు ఉన్నాయని చెబుతూ అడ్రస్సులను కూడా ఇచ్చింది.. కరాచీలోని వైట్ హౌస్, సౌదీ మసీదు దగ్గరలోనే ఓ చిరునామాను, కరాచీ నూరాబాద్‌లో ఇంటి నెంబర్‌. 37 డిఫెన్స్ 30 వీధిలోని పలాటియన్ భవనంలోకూడా ఉంటున్నట్లు పాకిస్తాన్‌ ప్రకటించింది. మళ్లీ ఏమనుకుందో ఏమో.. ఎవరి వత్తిళ్లకు తలవొగ్గిందో తెలియదు కానీ 24 గంటల్లోనే తూచ్‌.. అంతా ఉత్తిదే.. మా దగ్గర దావూడ్‌ లేడుగా…! అంటూ ఇంకో ప్రకటన చేసింది..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu