AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆసియాలో ఫస్ట్ టైం: కోవిడ్ రోగికి ఊపిరితిత్తుల మార్పిడి

ఆసియాలోనే మొట్ట మొదటి సారి ఓ కోవిడ్ రోగికి ఊపిరితిత్తులను మార్పిడిని విజయవంతంగా పూర్తి చేశారు. ఈ శస్త్ర చికిత్స చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో జరిగింది. కరోనా మహమ్మారి కారణంగా వైద్యులు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ రోగుల ప్రాణాలు కాపాడేందుకు..

ఆసియాలో ఫస్ట్ టైం: కోవిడ్ రోగికి ఊపిరితిత్తుల మార్పిడి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 30, 2020 | 3:17 PM

Share

ఆసియాలోనే మొట్ట మొదటి సారి ఓ కోవిడ్ రోగికి ఊపిరితిత్తులను మార్పిడిని విజయవంతంగా పూర్తి చేశారు. ఈ శస్త్ర చికిత్స చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో జరిగింది. కరోనా మహమ్మారి కారణంగా వైద్యులు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ రోగుల ప్రాణాలు కాపాడేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు. తాజాగా చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో ఓ కోవిడ్ రోగికి ఎంతో క్లిష్టమైన ఊపిరితిత్తుల మార్పిడి సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. ఫలితంగా ఆసియాలోనే మొదటిసారి ఈ ఆపరేషన్ చేసిన వారిగా వారికి ఘనత సాధించారు. దీనితో కలిపి ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకూ ముగ్గురి కరోనా రోగులకు ఈ సర్జరీ సక్సెస్ అయింది.

వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన ఓ 48 ఏళ్ల వ్యక్తి.. జూన్ 8న కరోనా బారిన పడ్డాడు. వైరస్ కారణంగా ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొంత భాగం మాత్రమే పని చేస్తున్నాయి. శ్వాస తీసుకునేందుకు కూడా ఇబ్బంది తలెత్తిన తర్వాత జూన్ 20 నుంచి అతన్ని వెంటిలేటర్‌పై ఉంచారు. పరిస్థితి విషమించగా జులై 30న ఘజియాబాద్ నుంచి విమానంలో చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రికి విమానం ద్వారా తరలించారు. జులై 25 నుంచి అతన్ని ఎక్మోపై ఉంచారు. అనంతరం ఆగష్టు 27న ఊపిరితిత్తుల మార్పిడి నిర్వహించినట్లు డాక్టర్ బాల క్రిష్ణన్ పేర్కొన్నారు. ప్రస్తుతం కరోనా బాధితుడి ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన తెలిపారు.

Read More:

విలన్‌ రోల్స్ చేసేందుకు రెడీ అంటోన్న నివేదా

ఇంకా డీప్‌ కోమాలోనే ప్రణబ్.. వెంటిలేటర్ మీద చికిత్స

బ్రేకింగ్: ఎంపీ అవినాష్ రెడ్డికి కరోనా పాజిటివ్

అన్నదాతలే మనకి గర్వకారణం.. ‘మన్‌కీ బాత్’లో ప్రధాని

మరో ఏపీ ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్

Follow Us