AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దాసరి ఫ్యామిలీలో ఆస్తి వివాదమేంటి ?

దివంగత దర్శకనిర్మాత దాసరి నారాయణరావు ఇంట ఆస్తి వివాదం మరోసారి రచ్చకెక్కింది. ఇద్దరు కుమారుల మధ్య ఆస్తి పంచాయతీ అగ్గి రాజుకుంటోంది. గత కొంతకాలంగా ఇద్దరు అన్నాదమ్ముల మధ్య తలెత్తిన ఆస్తి తగాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. దాసరి పెద్ద కొడుకు ప్రభు, తన తమ్ముడు అరుణ్

దాసరి ఫ్యామిలీలో ఆస్తి వివాదమేంటి ?
Jyothi Gadda
|

Updated on: Jun 27, 2020 | 12:53 PM

Share

దివంగత దర్శకనిర్మాత దాసరి నారాయణరావు ఇంట ఆస్తి వివాదం మరోసారి రచ్చకెక్కింది. ఇద్దరు కుమారుల మధ్య ఆస్తి పంచాయతీ అగ్గి రాజుకుంటోంది. గత కొంతకాలంగా ఇద్దరు అన్నాదమ్ముల మధ్య తలెత్తిన ఆస్తి తగాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. దాసరి పెద్ద కొడుకు ప్రభు, తన తమ్ముడు అరుణ్ పై శుక్రవారం జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 24న రాత్రి అరుణ్‌ తన ఇంటి గేటు దూకి లోపలికి వచ్చి తనపై, తన కుటుంబసభ్యులపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సినీ ఇండస్ట్రీ పెద్దలు ఈ విషయంలో జోక్యం చేసుకొని ఈ వివాదాన్ని పరిష్కరించాలని ప్రభు విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా తన తమ్ముడు నుంచి ప్రాణహానీ ఉందని పోలీసులే రక్షణ కల్పించాలని కోరారు. ప్రభు ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, శనివారం దాసరి అరుణ్ కుమార్ మీడియా ముందుకు వచ్చారు. తన అన్న ప్రభు చేసినవన్నీ తప్పుడు ఆరోపణలంటూ మీడియాకు వెల్లడించారు. మా మధ్య ఆస్తి గొడవలు తప్ప వేరే ఏమీ లేవన్నారు. ఆస్తి గొడవలు ప్రతీ ఇంట్లోనూ సహజమేనన్నారు. ఈ మేరకు వారి మధ్య మొదలైన వివాదానికి గల కారణాలను వివరించారు. ఏ ఇంటి విషయంలో అయితే, గొడవ మొదలైందో ఆ ఇళ్లు దాసరి నారాయణ రావు ముగ్గురు పిల్లలకు చెందుతుందన్నారు. అంటే, దాసరి ప్రభు, దాసరి అరుణ్ కుమార్‌తో పాటుగా వారి సోదరికి కూడా వర్తింస్తుందని చెప్పారు. ఈ నెల 25న తాను ప్రభు ఇంటికి వెళ్తే..26న ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేశారని ప్రశ్నించారు. ఆ రోజు తాను మద్యం తాగి వెళ్లలేదన్నారు. అయిన తను ఎస్సై సమక్షంలోనే ఇంటికి వెళ్లానని చెప్పారు. ఆ ఇంట్లోకి వెళ్లే హక్కు నాకు ఉందన్నారు అరుణ్ కుమార్.

అన్నయ్య ప్రభుకి తెలియకుండా నేను ఎటువంటి ఆస్తులను అమ్మలేదని చెప్పారు దాసరి అరుణ్ కమార్. ఆస్తులను అమ్మినట్లుగా చేస్తున్న ఆరోపణల్లో నిజానిజాలను బయటపెట్టాలని కోరారు. ప్రభును ఎవరో కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. తమ ఫ్యామిలీలో తలెత్తిన వివాదం కుటుంబ సభ్యులు కూర్చుని చర్చించుకుంటే సమసి పోతుందన్నారు. అంత మాత్రానికే వివాదంలోకి ఇతరులను లాగటం ఎందుకని అడిగారు. ఏది ఏమైనా సమస్య పరిష్కారమే తనకు ముఖ్యమన్నారు దాసరి అరుణ్ కుమార్.

శుక్రవారం పోలీసులను ఆశ్రయించిన దాసరి ప్రభు చేసిన ఆరోపణలు పరిశీలంచినట్లయితే..ఈ నెల 24న రాత్రి దాసరి అరుణ్‌తో పాటు అతడి డ్రైవర్‌ మా ఇంటి గేటు దూకి లోపలికి వచ్చాడు. మద్యం తాగి వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతూ నా భార్య, నాపై దాడి చేశాడు. అంతేకాకుండా మా నాన్న బీరువా తెరవడానికి ప్రయత్నించాడు. మా నాన్న(దాసరి) రాసిన వీలునామా ప్రకారం ఆయన మనవరాలు, నా కూతురు ఈ ఇంటికి అర్హురాలు. ఆస్తుల కోసం దాసరి అరుణ్ దౌర్జన్యం చేస్తున్నాడు. సి. కళ్యాణ్‌, మురళీమోహన్‌, మోహన్‌బాబు వంటి సినీ పెద్దలు ఈ విషయంపై స్పందించి పరిష్కరించాలి. అదేవిధంగా దాసరి అరుణ్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు ప్రభు.

Follow Us
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!
పాన్ కార్డులో ఫొటోను ఇంట్లో నుంచే నిమిషాల్లో మార్చుకోండి..
పాన్ కార్డులో ఫొటోను ఇంట్లో నుంచే నిమిషాల్లో మార్చుకోండి..