కరోనా అలర్ట్..! ఒక డోసు టీకా సరిపోతుంది..! రెండు డోసులు అవసరం లేదు..? తెలుసుకోండి..

Covid Vaccine : కరోనా రెండో వేవ్‌లో కేసులు అధికంగా నమోదవుతున్నాయి. వారందరికీ టీకాలు వేయడం ప్రభుత్వాలకు తలకు మించిన

కరోనా అలర్ట్..! ఒక డోసు టీకా సరిపోతుంది..! రెండు డోసులు అవసరం లేదు..? తెలుసుకోండి..
Corona Vaccination
Follow us

|

Updated on: Apr 30, 2021 | 4:40 PM

Covid Vaccine : కరోనా రెండో వేవ్‌లో కేసులు అధికంగా నమోదవుతున్నాయి. వారందరికీ టీకాలు వేయడం ప్రభుత్వాలకు తలకు మించిన భారంగా పరిణమించింది. అయితే కరోనా ఉన్నవారికి రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ అవసరం లేదని నిపుణుల కమిటీ తేల్చింది. టీకా ఒక్క డోసు సరిపోతుందని పరిశోధనలో తేలింది. ఈ విషయంలో పెన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ ఒక నివేదికను ప్రచురించింది.

అయితే భారతదేశం వంటి భారీ జనాభా ఉన్న దేశంలో కరోనా టీకా వ్యూహం మారుతుందా అనేది ఇప్పుడు చూడాలి. దేశంలో కరోనా పరిస్థితి రోజురోజుకు మారిపోతుంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం ముఖ్యమైన సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో క్యాబినెట్ మంత్రులు, స్వతంత్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు పాల్గొంటారు. ప్రధాని అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల్లోని కరోనా పరిస్థితిని సమీక్షిస్తారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న పడకలు, ఆక్సిజన్ స్థితి, టీకాల పురోగతి, ఔషధాల స్టాక్ గురించి చర్చిస్తారు. కరోనా వ్యాక్సిన్ కొత్త వ్యూహంపై ఏం నిర్ణయిస్తారో అని అందరు ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉంటే.. గత కొన్ని రోజులుగా రెమెడెసివిర్ ఇంజెక్షన్ గురించి షాకింగ్ సమాచారం వెలుగులోకి వస్తోంది. రాయ్‌గడ్‌లో ఈ ఇంజెక్షన్ల వాడకం వల్ల చాలా మంది రోగులను ప్రతికూల ప్రభావాలను చూపిందని తేలింది. అందువల్ల రాయ్‌గడ్ జిల్లాలో రెమెడిసివిర్ ఇంజెక్షన్ వాడకాన్ని వెంటనే నిలిపివేయాలని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశించింది. దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

కళ్లు మసక మసకగా కనిపిస్తున్నాయా..? చూపు మందగించిందా..! అయితే కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..?

Remdesivir: యాంటీ వైర‌ల్ డ్రగ్ కొరత తీర్చేందుకు కేంద్ర ప్రయత్నాలు.. విదేశాల నుంచి రెమ్‌డెసివర్ దిగుమ‌తికి అనుమతి

Trees: రెండు చెట్లు నరికినందుకు రూ.1.21 కోట్ల జరిమానా .. ఈ చెట్లకు ఉన్న ప్రాధాన్యత ఏంటో తెలిస్తే ఆశ్యర్యపోతారు