ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాని దేశాలివే…!

ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాని దేశాలివే...!

కరోనా వైరస్ తో ఇప్పుడు ప్ర‌పంచం అంతా అత‌లాకుత‌లం అయిపోతుంది. మ‌నుషుల ప్రాణాలు పోవ‌డ‌మే కాదు..ఆర్థికంగా కూడా దేశాలు చితికిపోతున్నాయి. ముందు ఈ డేంజ‌ర‌స్ వైర‌స్ నుంచి బ‌య‌ట‌ప‌డితే త‌ర్వాత ఆర్థిక ప‌రిస్థితి గురించి ఆలోచించ‌వ‌చ్చు. అందుకు ప్ర‌పంచ దేశాల‌న్నీ ఇప్పుడు లాక్ డౌన్ బాట‌ప‌ట్టాయి. ఆర్థికంగానూ చితికిపోయే పరిస్థితి ఏర్పడింది. వ్యాక్సిన్, మెడిసిన్ క‌నుగునేవ‌రకు ప్ర‌జ‌లకు, ప్ర‌భుత్వాల‌కు ఈ బాధ‌లు త‌ప్ప‌వు. ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో క‌రోనా వైర‌స్ విస్త‌రించింద‌ని చాలామంది భావించారు. కానీ […]

Ram Naramaneni

|

Apr 14, 2020 | 2:49 PM

కరోనా వైరస్ తో ఇప్పుడు ప్ర‌పంచం అంతా అత‌లాకుత‌లం అయిపోతుంది. మ‌నుషుల ప్రాణాలు పోవ‌డ‌మే కాదు..ఆర్థికంగా కూడా దేశాలు చితికిపోతున్నాయి. ముందు ఈ డేంజ‌ర‌స్ వైర‌స్ నుంచి బ‌య‌ట‌ప‌డితే త‌ర్వాత ఆర్థిక ప‌రిస్థితి గురించి ఆలోచించ‌వ‌చ్చు. అందుకు ప్ర‌పంచ దేశాల‌న్నీ ఇప్పుడు లాక్ డౌన్ బాట‌ప‌ట్టాయి. ఆర్థికంగానూ చితికిపోయే పరిస్థితి ఏర్పడింది. వ్యాక్సిన్, మెడిసిన్ క‌నుగునేవ‌రకు ప్ర‌జ‌లకు, ప్ర‌భుత్వాల‌కు ఈ బాధ‌లు త‌ప్ప‌వు. ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో క‌రోనా వైర‌స్ విస్త‌రించింద‌ని చాలామంది భావించారు. కానీ ఆ విషయం నిజం కాదు. . కరోనా వైరస్ రిసోర్స్ సెంటర్‌కు చెందిన జాన్ హాప్‌కిన్స్ యూనివర్శిటీ వెబ్‌సైట్లో పేర్కొన్న వివరాల ప్రకారం..చాలా దేశాల్లో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఆ కంట్రీస్ వివ‌రాలు ఇప్పుడు చూద్దాం…

 • కొమొరోస్
 • లెసోతో
 •  మార్షల్ దీవులు
 • పలావు
 • నౌరు
 •  సమోవ
 • కిరిబాటి
 •  వనౌటు
 •  సోలమన్ దీవులు
 • టోన్గా
 •  టువాలు
 •  తుర్క్మెనిస్తాన్
 •  తజికిస్తాన్

ఇక చైనాకు ప‌క్క‌నే ఉండే ఉత్తర కొరియాలో కూడా ఒక్క క‌రోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేద‌ని ఆ దేశం ప‌దే, ప‌దే ప్ర‌క‌టిస్తోన్న విష‌యం తెల‌సిందే. అయితే ఈ విష‌యంపై కిమ్ వైఖ‌రిపై ప‌లు దేశాలు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నాయి.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu