AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌లోకి క‌రోనా వ్యాక్సిన్‌

ఎక్క‌డైతే క‌రోనా పుట్టిందో అక్క‌డే క‌రోనా వ్యాక్సిన్ త‌యారీ చ‌ర్య‌లు ముమ్మ‌రంగా సాగుతున్నాయి. ఇప్ప‌టికే ఫ‌స్ట్ ట్రయ‌ల్ పూర్తి చేసుకుని సెకండ్ ఫేజ్ వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్ మొద‌లుపెట్టిన‌ట్లుగా తెలుస్తోంది.

రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌లోకి క‌రోనా వ్యాక్సిన్‌
Jyothi Gadda
|

Updated on: Apr 14, 2020 | 2:48 PM

Share

ప్ర‌పంచ దేశాల‌ను ప‌ట్టిపీడిస్తోన్న మ‌హ‌మ్మారి క‌రోనాను ఎదుర్కొనేందుకు ఇప్ప‌టి వ‌ర‌కు ఎటువంటి వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. ప్ర‌జ‌ల ప్రాణాల‌ను బ‌లితీసుకుంటున్న కోవిడ్ వైర‌స్‌ని నివారించేందుకు ప్ర‌పంచ‌శాస్త్ర‌వేత్త‌లు శ్ర‌మిస్తున్నారు. ఎక్క‌డైతే క‌రోనా పుట్టిందో అక్క‌డే క‌రోనా వ్యాక్సిన్ త‌యారీ చ‌ర్య‌లు ముమ్మ‌రంగా సాగుతున్నాయి. ఇప్ప‌టికే ఫ‌స్ట్ ట్రయ‌ల్ పూర్తి చేసుకుని సెకండ్ ఫేజ్ వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్ మొద‌లుపెట్టిన‌ట్లుగా తెలుస్తోంది.

క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ చర్యల్లో చైనా మరో అడుగు ముందుకేసింది. చైనా శాస్త్రవేత్తలు కరోనా వైరస్ టీకా రెండవ దశ క్లినికల్ ట్రయల్స్ ను మొదలు పెట్టింది. ఇందుకు దాదాపు 500 మంది వాలంటీర్లను నియమించుకుంది. ఇందులో ముఖ్యంగా వుహాన్ కు చెందిన 84 ఏళ్ల వుహాన్ నివాసి కూడా ఉన్నారు. ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ, అకాడమీ ఆఫ్ మిలిటరీ మెడికల్ సైన్సెస్ ఆఫ్ చైనా జెనెటిక్ ఇంజనీరింగ్ పద్దతుల్లో కోవిడ్-19 వ్యాక్సిన్ ను అభివృద్ది చేసింది. ఈ పరిశోధనా బృందానికి పిఎల్‌ఎ మేజర్ జనరల్ చెన్ వీ నేతృత్వం వహిస్తున్నారు.

ఇక‌, గ‌త మార్చి నెల‌లో ఈ బృందం చేపట్టిన మొదటి దశ పరీక్షల్లో పరిశోధకులు టీకా భద్రతపై దృష్టి సారించగా, రెండవ దశలో టీకా సమర్థతపై ఎక్కువ ఫోక‌స్ పెట్టారు. అలాగే రెండవ దశలో మొదటి దశ కంటే ఎక్కువమంది వాలంటీర్లు ఉన్నారనీ, ఇందులో ప్లేసిబో నియంత్రణ బృందం కూడా ఉందని అధ్యయనవేత్తలు తెలిపారు. ముఖ్యంగా, క్లినికల్ హ్యూమన్ టెస్టింగ్‌లో మొదటి దశగా వారు తెలిపారు. రెండు ప్రయోగాత్మక వ్యాక్సిన్లకుగాను మానవ పరీక్షలను చైనా ఆమోదించినట్లు స్థానిక‌ మీడియా జిన్హువా మంగళవారం నివేదించింది.

Follow Us
వామ్మో.. ఎంత పెద్ద పాములో.. ఒకేచోట రెండు నాగుల సయ్యాట..!
వామ్మో.. ఎంత పెద్ద పాములో.. ఒకేచోట రెండు నాగుల సయ్యాట..!
రాహు ప్రభావంతో వీరికి అన్నింట్లో విజయమే, ఊహించని డబ్బే డబ్బు
రాహు ప్రభావంతో వీరికి అన్నింట్లో విజయమే, ఊహించని డబ్బే డబ్బు
హోటల్ స్టైల్ స్పైసీ ఉల్లిపాయ ఊరగాయ.. ఇలా చేస్తే ముక్క కూడా వదలరు
హోటల్ స్టైల్ స్పైసీ ఉల్లిపాయ ఊరగాయ.. ఇలా చేస్తే ముక్క కూడా వదలరు
అదిరే పెర్ఫామెన్స్‌తో మార్కెట్లోకి రెడ్‌మి ప్యాడ్ 2 ప్రో 5G
అదిరే పెర్ఫామెన్స్‌తో మార్కెట్లోకి రెడ్‌మి ప్యాడ్ 2 ప్రో 5G
జాతకంలో సూర్యుడు ఏ ఇంట్లో ఉన్నాడు? 12 భావాల్లో సూర్యుని ఫలితాలు..
జాతకంలో సూర్యుడు ఏ ఇంట్లో ఉన్నాడు? 12 భావాల్లో సూర్యుని ఫలితాలు..
పప్పు, సాంబార్‌లోకి అదిరిపోయే సైడ్ డిష్ బెండకాయ రవ్వ వేపుడు..
పప్పు, సాంబార్‌లోకి అదిరిపోయే సైడ్ డిష్ బెండకాయ రవ్వ వేపుడు..
సీఎం సార్.. ప్లీజ్.. చదువు చెప్పడానికి టీచర్లను ఇవ్వండి సార్
సీఎం సార్.. ప్లీజ్.. చదువు చెప్పడానికి టీచర్లను ఇవ్వండి సార్
నోయిస్‌ నుంచి స్టైలిష్‌ లుక్‌తో కొత్త ఇయర్ బడ్స్‌
నోయిస్‌ నుంచి స్టైలిష్‌ లుక్‌తో కొత్త ఇయర్ బడ్స్‌
తక్కువ బడ్జెట్‌లో 360° థియేటర్ అనుభూతి కావాలా
తక్కువ బడ్జెట్‌లో 360° థియేటర్ అనుభూతి కావాలా
విరిగిన ఎముకలకు బలాన్నిచ్చే జొన్న పిండి లడ్డులు..
విరిగిన ఎముకలకు బలాన్నిచ్చే జొన్న పిండి లడ్డులు..