కరోనా టైమ్: శానిటైజర్ల, మాస్క్‌ల ధరలపై కేంద్రం సంచలన నిర్ణయం

COVID 19: ప్రపంచదేశాలను కరోనా వైరస్ గజగజలాడిస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి సుమారు 6 వేల మంది ప్రాణాలు కోల్పోగా..  బాధితుల సంఖ్య 1,59,844కు చేరుకుంది. భారత్‌లో కూడా కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం ఇండియాలో ఈ సంఖ్య 110కు చేరింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాయి. అటు సినీ తారలు, క్రికెటర్లు కూడా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక […]

  • Updated On - 2:12 pm, Mon, 16 March 20
కరోనా టైమ్: శానిటైజర్ల, మాస్క్‌ల ధరలపై కేంద్రం సంచలన నిర్ణయం

COVID 19: ప్రపంచదేశాలను కరోనా వైరస్ గజగజలాడిస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి సుమారు 6 వేల మంది ప్రాణాలు కోల్పోగా..  బాధితుల సంఖ్య 1,59,844కు చేరుకుంది. భారత్‌లో కూడా కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం ఇండియాలో ఈ సంఖ్య 110కు చేరింది.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాయి. అటు సినీ తారలు, క్రికెటర్లు కూడా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక కోవిడ్ 19 బారిన పడకుండా ఉండేందుకు ప్రజలు శానిటైజర్లు, మాస్క్‌లను ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. దీనితో వీటి వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది.

అయితే ఈ శానిటైజర్లు, మాస్క్‌ల ఉత్పత్తి తక్కువ అయిపోవడం.. అలాగే డిమాండ్ భారీగా పెరగడంతో అధిక ధరలకు వాటిని విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారుల వ్యవహారాల విభాగం ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్, 1955 కింద ఈ రెండు వస్తువులను అత్యవసర జాబితాలో చేర్చింది. శానిటైజర్స్, మాస్క్‌లను అత్యవసర వస్తువులుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలను ఆదేశించింది. అంతేకాకుండా వాటి ఉత్పత్తిని పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.

మరోవైపు శానిటైజర్లు, మాస్కులను నిల్వ చేసి ఎక్కువ రేట్లకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని.. నిబంధనలను మీరితే ఏడేళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధిస్తామని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో శానిటైజర్లు, మాస్కులను జూన్ 30 వరకు నిత్యావసరాల జాబితాలో ఉంచనున్నట్లు మోదీ సర్కార్ స్పష్టం చేసింది. కాగా, కరోనా వైరస్‌కు సంబంధించిన అంశాలపై కస్టమర్లకు 1800-100-400కు హెల్ప్‌లైన్‌ 24 గంటలు అందుబాటులో ఉంటుందన్నారు.’

For More News:

ఉగ్రవాదులకు భయాన్ని పరిచయం చేసిన కరోనా.. ఆ పనులకు ఫుల్‌‌స్టాప్..

కొత్త జంటలకు విలన్‌గా కరోనా.. భారీగా నమోదైన విడాకుల కేసులు..

ఐపీఎల్ నిర్వహణకు మరో ఐదు తేదీలు..?

రోజా ది గ్రేట్.. నాగబాబుకు మరోసారి షాక్..!

ఇండియాలో విజృంభిస్తున్న కరోనా.. దేశంలో నమోదైన కేసుల వివరాలు ఇవే..

Breaking: కరోనా ఎఫెక్ట్.. మధ్యప్రదేశ్ అసెంబ్లీ 26 వరకు వాయిదా..

గుడ్ న్యూస్.. ఎయిడ్స్ మందులతో కరోనా నయం.. సీఎం కంగ్రాట్స్..